ఆ రాష్ట్రంలో పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ పెట్టాల్సిందే! ఎందుకంటే

బాల్య వివాహాలు ఇప్పటికి ఎక్కువగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంటుంది.

అనాదిగా వస్తున్న ఆచారాల్ని కొనసాగిస్తూ ఇప్పటికి చాలా రాష్ట్రాలలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు.

చట్టపరంగా బాల్య వివాహాలపై ఎలాంటి కఠిన వైఖరి తీసుకున్న ఆచారాల్ని బలంగా విశ్వసించే వారు చిన్న వయసులో ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం మానడం లేదు.ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు, రాజస్థాన్ లో ఇలాంటి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

అయితే బాల్యవివాహాలు అడ్డుకోవడం కోసం రాజస్థాన్ అధికారులు ఒక ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటి నుంచి వివాహ ఆహ్వాన పత్రికలలో ఖచ్చితంగా వధూవరుల పుట్టిన తేదీలను జతపర్చాలని ఆదేశాలు జారిచేశారు.

బాల్యవివాహాలపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి వాటిని యధావిధిగా చేస్తూ ఉండటంతో పాటు పెద్దల సామాజిక కట్టుబాట్లకి చిన్నారి ఆడపిల్లలు బలవుతున్నారు.దీంతో రాజస్తాన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ప్రస్తుతం అధికారులు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని బుండీ జిల్లాలో మెుదలుపెట్టారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు