భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు నాల్గవ టీ20 మ్యాచ్ రాయపూర్ ( Raipur )వేదికగా ఉత్కంఠ భరితంగా జరగనుంది.ఈ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన భారత జట్టు మూడవ మ్యాచ్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
మరొకవైపు మూడవ టీ20 మ్యాచ్ లో గెలిచిన ఆస్ట్రేలియా( Australia ) జట్టు నేడు జరిగే మ్యాచ్లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగనుంది.నాలుగవ టీ20 మ్యాచ్ జరిగే రాయపూర్ వేదిక వాతావరణ పరిస్థితులను గమనిస్తే.వరుసగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉండకపోవచ్చు కానీ మధ్యలో అప్పుడప్పుడు మ్యాచ్ కు వాతావరణం కారణంగా అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాయపూర్ లో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు అత్యధికంగా కేవలం 9 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండనుంది.వర్షం పడకపోయినా ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
అంటే ముందుగా బౌలింగ్ చేసే జట్టుకు గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నాల్గవ టీ20 మ్యాచ్ ఆడే భారత జట్టు ఇదే: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ), సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బీష్ణోయి, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహార్.