Balineni Srinivasa Reddy : పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించం..: బాలినేని

వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించమని పేర్కొన్నారు.

 Balineni Srinivasa Reddy : పేదలకు అన్యాయం చేయా-TeluguStop.com

సీఎం జగన్( CM Jagan ) ఆదేశాలతో ఒంగోలులో భూములు తీసుకున్నామని తెలిపారు.మళ్లీ పట్టాల పంపిణీ ఆపాలని మరోసారి కోర్టులో పిల్ వేశారని పేర్కొన్నారు.

పట్టాలు ఇవ్వకూడదని ఇలాంటి పనులు చేస్తే ప్రజలు చీదరించుకుంటారని వెల్లడించారు.ఒంగోలులో( Ongole ) పట్టాలు ఇవ్వకుంటే పోటీ చేయనని చెప్పినట్లు తెలిపారు.

అర్హులైన పేదలను అధికారులే పారదర్శకంగా ఎంపిక చేశారన్న బాలినేని అర్హులైన టీడీపీ( TDP ) వాళ్లకు కూడా పట్టాలు ఇస్తామని తెలిపారు.భూముల కొనుగోలుకు ఎకరాకు రూ.8 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తున్నారని, తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.ఈ క్రమంలోనే ఎవరెన్ని కుట్రలు చేసినా ఇళ్ల పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube