ఆరు హామీలను చట్టాలుగా మారుస్తాం..: రాహుల్ గాంధీ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.నాసిరకం పనుల వలనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారన్న ఆయన ధరణి పోర్టల్ తో పేదల భూములను లాక్కంటున్నారని ఆరోపణలు చేశారు.తెలంగాణను ఇచ్చింది, హైదరాబాద్ ను తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్ధతు ఇస్తారని తెలిపారు.బీజేపీకి బీఆర్ఎస్.

Advertisement

బీఆర్ఎస్ కు బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని మండిపడ్డారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా ఆరు హామీలను చట్టాలుగా మారుస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు