ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం - సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలి.100 కి వంద శాతం అమలయ్యేలా ఉండాలి.లేదంటే ఆకాశంలో చుక్కలు తెస్తామని కూడా అనొచ్చు.

 We Welcome New Parties In Democracy Sajjala Ramakrishna Reddy Details, New Polit-TeluguStop.com

మ్యానిఫెస్టో తయారీకి ముందే రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం పరిశీలించాలి.మేము చెప్పినవవి 98 శాతం పైగా పూర్తి చేశాం.

అందుకు ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారు.ఆ రోజు 2014లో ఇలాంటి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఉంటే అదికారంలోకి వచేవాల్లం.

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం.కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి మా పనితీరును మరింత మెరుగు పరుచుకోవచు.

మా విధానం మాకుంది…మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం.ప్రజలు మమ్మల్ని సొంతం చేసుకున్నారు.కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషకుల స్థానంలో లేము.మా రాష్ట్రం అభ్యున్నతి మాకు ముఖ్యం.

చిరంజీవి తన తమ్ముడి గురించి ఒక అన్నగా ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడారు.ఈ రాష్ట్రం మా వేదిక…ఇక్కడి ప్రజల బ్లేస్సింగ్స్ అడుగుతున్నాం.

పక్క రాష్ట్రాల గురించి మేము మాట్లాడటం లేదు.వాళ్ళు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి విమర్శలు ఎందుకు…? భవిష్యత్తు రాజకీయాల గురించి వాళ్ళు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు.మేము ఇక్కడి వ్యవహారాలపై మాత్రమే కట్టుబడి ఉన్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube