తింటాం తప్ప చేయడం రాదు.. వైరల్ అవుతున్న శివాని శివాత్మిక కామెంట్స్!

నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రజలు ఉగాది( Ugadi )పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోని సెలబ్రిటీలో కూడా ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా అభిమానులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా పలు విషయాల గురించి కూడా మాట్లాడారు.

 We Cant Do Anything Unless We Eat Shivani Shivatmikas Comments Are Going Viral ,-TeluguStop.com

హైదరాబాదులో ఉంటే అమ్మ నాన్నలతో కలిసి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటామని శివాని(Shivani) శివాత్మిక( Shivatmika) వెల్లడించారు.ఇక ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఎంతో స్పెషల్ ఉగాది పచ్చడి తినడం మాకు చాలా ఇష్టం కానీ తయారు చేయడం రాదంటూ ఇద్దరు తెలిపారు.

Telugu Chennai, Shivani, Shivatmika, Tollywood, Ugadi-Movie

ప్రస్తుతం తాము చెన్నైలో తమ బంధువులతో కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఈ నటీమణులు వెల్లడించారు.అభిమానులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ ఏడాది మొత్తం తనకు మంచి అవకాశాలు రావాలని ఇలా అవకాశాలను అందుకొని ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాలని కోరుకున్నారు.ఇక ప్రస్తుతం తాను ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నానని, మంచి డాక్టర్ అవ్వాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

వర్కౌట్స్, షూటింగ్, చదువు ఏం చేసినా కూడా క్రమశిక్షణతో చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా శివాని వెల్లడించారు.

Telugu Chennai, Shivani, Shivatmika, Tollywood, Ugadi-Movie

ఇక శివాత్మిక కూడా అభిమానులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ ఏడాది చేతినిండా పని ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈమె తెలిపారు.తెలుగు తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషలో కూడా తనకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు శివాత్మిక వెల్లడించారు.ఇక ప్రస్తుతం కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని వీలైతే ఏదైనా స్పోర్ట్స్ నేర్చుకోవాలని ఉంది అంటూ ఈ సందర్భంగా శివాత్మిక వెల్లడించారు ఇలా ఉగాది పండుగ సందర్భంగా ఈ అక్క చెల్లెలు ఇద్దరు వారి మనసులో ఉన్న కోరికను బయటపెడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube