దేనికైనా మేము సిద్ధం టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నాలుగు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఆల్రెడీ తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ ముగిసింది.ఆదివారం ఫలితాలు రాబోతున్నాయి.దీంతో ఏపీలో రాజకీయం ఉన్న కొద్ది వేడెక్కుతుంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేయనుంది.తెలుగుదేశం( TDP ) మరియు జనసేన( Janasena ) కలిసి పోటీ చేయబోతున్నాయి.

 We Are Ready For Anything Ex Tdp Mp Maganti Babu Sensational Comments Details, T-TeluguStop.com

ఈ క్రమంలో ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై రకరకాల చర్చలు జరుపుతున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా తెలుగుదేశం నేత మాజీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు( Maganti Babu ) వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తాము దేనికైనా మేము సిద్ధం.ప్రాణానికి ప్రాణం.కాలికి కాలు అని అన్నారు.కానీ చంద్రబాబుపై( Chandrababu Naidu ) గౌరవం.

ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, పేదల పార్టీ, బీసీల పార్టీ, మహిళల పార్టీ అన్నిటిని గుర్తించుకుని కట్టుబడి ఉంటున్నామని స్పష్టం చేశారు.భారతదేశంలో క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని మాగంటి బాబు వ్యాఖ్యానించారు.

అటువంటి పార్టీలో పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.శుక్రవారం లోకేష్ పాదయాత్రలో మాగంటి బాబు పాల్గొనడం జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీని ఉద్దేశించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube