ఇంట్లో పిల్లలు ఉంటే చెప్పేది ఏముంది.అల్లరి.
వాళ్ళ ముద్దు ముద్దు మాటలు.వారి నవ్వులు ఇలా మనల్ని వారి చేష్టలతో అలరిస్తారు…ఒక్కోసారి కొంతమంది పిల్లలు తీవ్రమైన కోపానికి చికాకుకి లోనవుతారు.
వారికి ఆ సమయంలో ఏమి చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు.పెద్దవారు అర్థం చేసుకున్నట్టుగా వారు చేసుకోలేరు కదా.విపరీతమైన కోపం వస్తే చేతికి దొరికిన వస్తువులు విసిరి పారేస్తారు.
గట్టిగా అరవడం.
నెల మీద పది దొర్లడం.ఇలా వారు చేయని పని లేదు.
ఆ పనులకి మారిత కోపం ముంచుకొస్తుంది.పెద్దవాలు అలాంటి సమయంలో ఏమి చేయాలో ఎలా వారిని కంట్రోల్ చేయాలో తెలియక అసహనంతో వారిని కొట్టడం చేస్తారు.
పిల్లలు అలాంటి అల్లరిపనులు చేస్తున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే వారిని మన దారిలోకి తెచ్చుకోవచ్చు.ఎలా అంటే
పిల్లలు ఎందువలన గొడవ చేస్తున్నారు.
అనేది తెలియాలి అంటే తమ భాదను మాటల్లో చెప్పగలిగేలా ప్రోత్సహించాలి.సాధ్యమైనంత నవ్వించే ప్రయత్నం చేయాలి.
ఆసమయంలో మీరు కూడా వాళ్ళతో పాటు చిన్న పిల్లాడిలా మారక తప్పదు.పిల్లలు ఏడుస్తున్నారు అనగానే చాలా మంది వాళ్ళు అడిగింది చేసేస్తారు.
కావలసింది కొనేస్తారు.అలా చేస్తే అది ఇంకా ప్రమాదం.
మరి అటువంటి సమయంలో మనం ఎం చేయాలి అంటే.