Robotic Dogs : వీడియో: రోబో డాగ్‌ను కలిసిన అసలైన కుక్క.. దాని రియాక్షన్ చూస్తే ఫిదా..

ఇటీవల కాలంలో మనుషులను పోలిన రోబోలను మాత్రమే కాకుండా జంతువులను పోలిన రోబోలను కూడా తయారు చేస్తున్నారు.ముఖ్యంగా రోబోటిక్ డాగ్స్( Robotic Dogs ) ఎక్కువైతున్నాయి.

 Watch The Reaction Of A Real Dog Who Meets A Video Robot Dog-TeluguStop.com

మరి ఈ రోబో కుక్కలను అసలైన కుక్కలు కలిస్తే వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది? దాన్ని చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( Indian Institute of Technology ) (ఐఐటీ) కాన్పూర్‌లో ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా లాంటి సీన్ కనిపించింది.

ఇన్‌స్టిట్యూట్ ఇటీవల వార్షిక సాంకేతిక ఉత్సవం అయిన “టెక్కృతి” సెలెబ్రేట్ చేసుకుంది.ఈ ఫెస్ట్ సందర్భంగా క్యాంపస్‌లోని వీధికుక్కలు, రోబోటిక్ కుక్కల మధ్య ప్రత్యేకమైన ఇంటరాక్షన్ జరిగింది.

వివిధ ఉపయోగాల కోసం రోబోలను రూపొందించే ముక్స్ రోబోటిక్స్( Mux Robotics ) అనే సంస్థ తమ నాలుగు కాళ్ల రోబోలలో ఒకదాన్ని ఈవెంట్‌కు తీసుకువచ్చింది.ఆ రోబో గడ్డిపై తిరుగుతూ ఉండగా, క్యాంపస్‌లోని కొన్ని వీధికుక్కలు దానిని ఆసక్తిగా పరిశోధించడం ప్రారంభించాయి.ఆ రోబో కుక్కల దగ్గరకు వచ్చింది తనని కొత్తగా చూస్తున్నట్లు గమనించింది ప్రతిస్పందించి, ఆపై వాటితో ఆడుకోవడం ప్రారంభించింది.అలానే వెనుకకు దొర్లడం ద్వారా అసలైన కుక్క ప్రవర్తనను కూడా ఇమిటేట్ చేసింది.

ముక్స్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు, CEO అయిన డాక్టర్ ముఖేష్ బంగర్( Dr.Mukesh Bangar ) ఈ క్షణాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.అతను దానిని పోస్ట్ చేసినప్పటి నుంచి వీడియో బాగా పాపులర్ అయ్యింది, 6,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.రోబో కుక్క నిజమైన కుక్కలతో ఇంటారక్ట్ అయిన తీరు చూస్తుంటే టెక్నాలజీ కూడా సరదాగా ఉండగలదు అని స్పష్టం అవుతోంది.

ఈ వీడియో చూసి చాలా మంది ఫన్నీ కామెంట్లు పెట్టారు.ఈ కుక్కలు తమ స్నేహితులకు ఈ రోబో డాగ్ గురించి గొప్పగా చెబుతాయేమో అని ఒక వ్యక్తి హాస్యాస్పదంగా కామెంట్ చేశాడు.

కొంతమంది వీక్షకులు ఈ వీడియో సైన్స్, నిజ జీవితాల సమ్మేళనంగా కూడా చూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube