వైరల్: పాము నోటిలోని కప్ప... ఎలా తప్పించుకుందో చూడండి!

సోషల్ మీడియా( Social Media ) అందుబాటులోకి వచ్చాక రకరకాల కంటెంట్ మనం చూడగలుగుతున్నాం.ఎక్కడ ఎలాంటి ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్న మనం ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.

 Watch How Frog Escaped From Snake Attack Video Viral Details, Snake, Frog, Lates-TeluguStop.com

సాధారణంగా ఎలుకలకు పిల్లులను నుంచి, పిల్లులకు కుక్కల నుంచి ప్రాణ భయం అనేది ఉంటుంది.ఇక మనుషులనుండి మిగతా అన్ని జీవులకు భయం ఉంటుందనుకోండి, అది వేరే విషయం.

అదేవిధంగా కప్పలకు( Frogs ) పాముల నుంచి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది.ఒక్కసారి వాటి నోట పడ్డాయంటే.

ఇక అవి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.అయితే అప్పుడప్పుడూ ఇక్కడ వీడియోలో చూసినట్టు కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి.

Telugu Frog, Frog Escaped, Latest, Park, Snake, Snake Eat Frog, Snake Frog, Anim

కొన్నిసార్లు భూమిమీద నూకలు మిగిలితే, చావు అంచుల దాకా వెళ్లి.క్షేమంగా బయటపడుతుంటాయి.ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఓ కప్పను పాము( Snake ) మింగేయాలని తెగ ట్రై చేసింది.

అయితే చివరి నిముషంలో దాన్ని నుంచి కప్ప క్షేమంగా బయటపడింది.ఈ వీడియో పాత అయినప్పటికీ మరలా మరలా వైరల్ అవుతోంది.

ఓ కప్ప పార్కుల్లో హాయిగా విహరిస్తూ ఉండగా ఇంతలో ఓ పాము హఠాత్తుగా వచ్చి కప్పను వదలకుండా వెంబడిస్తుంది.ఎలాగైనా మింగేయాలనే ఉద్దేశంతో కప్ప కాలిని గట్టిగా పట్టుకుంటుంది.

మరోవైపు కప్ప కూడా తన ప్రాణాలను కాపాడుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.

Telugu Frog, Frog Escaped, Latest, Park, Snake, Snake Eat Frog, Snake Frog, Anim

ఈ క్రమంలో పాము నోటిలో వున్న దాని కాలిని( Frog Limb ) బలంగా ముందుకి లాగుతుంది.ఇలా చాలా సేపటి తర్వాత.ఎట్టకేలకు కప్ప పాము నుంచి తప్పించుకుని అక్కడి నుంచి తుర్రుమంటుంది.

మరి పాము ఊరుకుంటుందా? దానిని ఈరోజు ఎలాగన్నా తినాలనే ఉద్దేశంతో వెంటపడుతుంది.పాము నుంచి దూరంగా వెళ్లిపోయిన కప్ప.

ఇనుప గేటు నుంచి గోడ పైకి దూకి, అటు నుంచి గోడ పైకి పాకిపోతుంది.దీంతో చివరకు పాము.

దానిని పట్టుకోవడం కష్టం అనుకోని నిరాశగా వెనుదిరగాల్సి వస్తుంది.కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube