ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి!

వరంగల్ లో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది నడి రోడ్డు మీద ప్రేమించలేదని రవళి అనే అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.

ప్రేమ పేరుతో తిరిగి తనని మోసం చేసిందని కోపంతో ఉన్మాదిగా మారిన అన్వేష్ అనే యువకుడు హన్మకొండ లో నయీం నగర్ లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

ఇక ఆమెని రక్షించడానికి వచ్చిన వారిని కూడా బెదిరింపులకి పాల్పడ్డాడు.దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెని హాస్పిటల్ లో చేర్చారు.

తరువాత ఆమెని ప్రభుత్వం హైదరాబాద్ తరలించి చికిత్స అందించింది.ఇక 70 శాతం కాలిన గాయాలతో 8 రోజులు మృత్యువుతో పోరాడిన రవళి ఈ రోజు ప్రాణం విడిచింది.

ఇక ఆమెని నిప్పు పెట్టి అన్వేష్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా అతనిపై హత్యా నేరం నమోదు చేసినట్లు తెలుస్తుంది.ఇక రవళి మృతి వార్త విని ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకి గురవుతున్నారు.

Advertisement

ఇక ఆమెని హత్య చేసిన అన్వేష్ కి ఉరిశిక్ష విధించాలని మహిళా సంఘాలు, విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి
Advertisement

తాజా వార్తలు