హీరో స్పెండర్ ప్లస్ బైక్ కొనాలని అనుకుంటున్నారా? రూ.18 వేలకే ఇలా సొంతం చేసుకోండి!

హీరో కంపెనీనుండి వచ్చిన స్ప్లెండర్ ప్లస్(Splendor Plus) అంటే జనాలకి ప్రత్యేకమైన క్రేజ్.ఇది మధ్య తరగతివాడి బండిగా ప్రఖ్యాతి గాంచింది.

 Want To Buy A Hero Spender Plus Bike Own This For Rs.18 Thousand, Hero ,bike, Bu-TeluguStop.com

దానికి కారణం ఒక్కటే… అదే దాని మైలేజ్.మరి ఇలాంటి బైక్ ని ఇపుడు మీరు కేవలం 18 వేలకే మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.

దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌ వెహికల్స్ లలో నెంబర్ వన్ స్థానంలో వున్నది ఇదే కావడం విశేషం.ఇప్పుడు ఈ బైక్ మీకు కావాలంటే 18వేల రూపాయలు కడితే సరిపోతుంది.

అదేలాగో తెలుసుకోవాలంటే ఈ కధనం పూర్తిగా చెదవాల్సిందే.

హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ మొత్తం 4 వేరియంట్లలో మార్కెట్లో మీకు అందుబాటులో వుంది.దీని బేస్ వేరియంట్ ధర 72 వేల రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది.ఇందులో టాప్ వేరియంట్ ధర విషయానికొస్తే రూ.74,400గా వుంది.ఇక్కడ మీరు బైక్ టాప్ వేరియంట్‌ని(Top variant) కొనుగోలు చేయాలని అనుకుంటే దాని ధర రూ.86,864గా ఉంటుంది.మీకు ఆన్ రోడ్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయన్న సంగతి విదితమే.ఇప్పుడు మీరు ఈ వేరియంట్‌ను లోన్‌పై మీరు కొనుగోలు చేయాలని అనుకుంటే కొన్ని విషయాలు గమనించాలి.

మీరు ఎంచుకున్న దాన్ని బట్టి ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు.వివిధ బ్యాంకులలో వడ్డీ రేట్లు అనేవి భిన్నంగా ఉంటాయి.లోన్ కాలపరిమితి మీరు 1 నుండి 7 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు.ఉదాహరణకు, మీరు ఇక్కడ చెప్పినట్టు రూ.18,000 డౌన్ పేమెంట్ కడితే… రూ.18,000 (20%), వడ్డీ రేటు 10%, 3 సంవత్సరాల రుణ కాలవ్యవధిని నిశితంగా పరిశీలించినట్టైతే, మీరు ప్రతి నెలా రూ.2,222 EMI చెల్లిస్తే సరిపోతుంది.అంటే మొత్తం లోన్ మొత్తానికి (రూ.68,864) అదనంగా రూ.11,128 చెల్లిస్తారన్నమాట.ఇక స్ప్లెండర్ ప్లస్ 97.2cc ఫీచర్ల విషయానికిఒటే ఫోర్-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో(Four-stroke single-cylinder engine) ఇది పనిచేస్తుంది.హీరో స్ప్లెండర్ ప్లస్ దాని మైలేజ్, విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందిందనే విషయం చెప్పాల్సిన పనిలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube