రైలులో అప్పర్ బెర్త్ కావాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!

అదేంటి రైల్వేలో కింది బెర్ట్ రిజర్వ్ చేసుకోవడానికి రూల్స్ ఉంటాయి కానీ పై బెర్ట్ కోసం కూడా రూల్స్ వుంటాయని అని అంతగా ఆశ్చర్యపోవద్దు.రూల్స్ అంటే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది.

 Want An Upper Berth In A Train? Know These Rules,train, Rail Journey, Train Jou-TeluguStop.com

ప్రయాణికుల్లో చాలామంది అడ్వాన్స్‌గా తమ జర్నీని IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో టికెట్స్ బుక్ చేసుకుంటూ వుంటారు.ట్రైన్ టికెట్ బుక్ చేసేప్పుడు బెర్త్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ‘లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ లోయర్ బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్’ అని వేర్వేరు బెర్త్ ఆప్షన్స్ ఉంటాయి అనే విషయాలు చాలామంది గమనించారు.

అలా తమకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవడానికే అటువంటి ఆప్షన్ అందుబాటులో ఉంచింది రైల్వే.వీటిలో అప్పర్ బెర్త్‌కు సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

Telugu Bert Reserve, Indian Railways, Irctc Website, Rail Journey, Train, Upper

రైల్వే ప్రయాణికులు చాలా ముందుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే తమకు కావాల్సిన బెర్త్ లభిస్తుంది కానీ ప్రయాణ తేదీకి కాస్త ముందుగా బుక్ చేసినట్టైతే ఏ బెర్త్ లభిస్తే ఆ బెర్త్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.అయితే లోయర్ సీట్‌లో ఇద్దరు ఆర్‌ఏసీ టికెట్స్ ఉన్నవారు కూర్చున్నట్టైతే అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి అన్న సందేహం రావడం మామూలే.

Telugu Bert Reserve, Indian Railways, Irctc Website, Rail Journey, Train, Upper

థర్డ్ ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్‌లో ప్రతీ సెక్షన్‌లో ఎనిమిది బెర్తులు వుంటాయని సంగతి విదితమే.వాటిలో 2 లోయర్ బెర్త్, 2 మిడిల్ బెర్త్, 2 అప్పర్ బెర్త్, 1 సైడ్ లోయర్ బెర్త్, 1 సైడ్ అప్పర్ బెర్త్ ఉంటాయి.మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు లోయర్ బెర్త్‌లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది.అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే.

రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రపోయే సమయం ఎవరి బెర్త్‌లో వారు నిద్రపోవాలి.అయితే సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు ఆర్‌ఏసీ టికెట్స్ ద్వారా కేటాయిస్తే, సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి అన్న డౌట్ వస్తుంది.

ఇక్కడ కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube