వామ్మో.. ఇది ఆరంభం మాత్రమే అంటున్న డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచాన్ని కకలా వికలం చేస్తున్న కరోనాను ప్రపంచ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తుంది అనడంలో సందేహం లేదు.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈమద్య కాలంలో డబ్ల్యూహెచ్‌ఓ పని చేస్తుంది.

ప్రపంచ దేశాలన్నింటిని ఒక్క తాటిపైకి తీసుకు రావడంతో పాటు అందరిని సమన్వయపర్చుతూ ముందుకు సాగించడంలో డబ్ల్యూహెచ్‌ఓ క్రియాశీలకంగా వ్యవహరించింది.అందుకే కరోనా సమయంలో ఆ సంస్థపై చాలా మంది గురి పెట్టుకున్నారు.

ఆ సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ ఎప్పుడు ప్రెస్‌ మీట్‌ పెట్టినా కూడా జనాలు ఎంతో ఆసక్తిని కనబర్చుతున్నారు.కరోనా వ్యాక్సిన్‌ గురించి ఆయన చేసే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

కరోనా విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా ఆయన చేసిన ప్రకటన ఫైనల్‌గా తీసుకుంటున్నారు.కరోనా మహమ్మారి నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Advertisement

కరోనా కంటే భయంకరమైన వైరస్‌లను గతంలో ఎదుర్కొన్నాం.ముందు ముందు కూడా కరోనాను మించిన వైరస్‌ లను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందులో ఎలాంటి అనుమానం లేదు.కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హెచ్చరించాడు.

అన్ని దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ డబ్ల్యూహెచ్‌ ఓ పేర్కొంది.ఆయన ప్రకటనతో ప్రజలు మరింత భయపడుతున్నారు.

కరోనా ఇంకా ఏమాత్రం తగ్గలేదని జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు