ఏపీలో లంచాలు లేని వ్యవస్థను తీసుకువచ్చామని సీఎం జగన్ ( CM Jagan )అన్నారు.గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువని చెప్పారు.
ప్రజల కష్టాలను చూసి తమ మ్యానిఫెస్టో పుట్టిందన్నారు.చంద్రబాబు మ్యానిఫెస్టో( Chandrababu Manifesto ), హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోని హామీలను తీసుకుని తయారు చేశారని పేర్కొన్నారు.
చంద్రబాబు ఆరు వాగ్దానాలంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.ఈ ఆరు శాంపిల్స్ మాత్రమేనని చెబుతున్నారన్న సీఎం జగన్ అమలుకు సాధ్యం కానీ హామీలను చంద్రబాబు ఇస్తున్నారని చెప్పారు.
హామీలు అమలు చేసేది లేదు కాబట్టి ఏదేదో చెబుతారన్నారు.
చంద్రబాబును నమ్మితే, బంగారు కడియం ఇస్తామన్న పులిని నమ్మడమేనని తెలిపారు.ఈ క్రమంలోనే చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చిందన్న సీఎం జగన్ బాబుకు ఓటు వెయ్యడం అంటే పిల్లల భవిష్యత్ తాకట్టు పెట్టడమేనని తెలిపారు.
చంద్రబాబు వస్తే చంద్రముఖిలు వస్తాయని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండన్నారు.ప్రతిపక్షం చేస్తున్న దాడి తనపై కాదన్నారు.చంద్రబాబుకు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ, పరోక్షంగా మరో జాతీయ పార్టీ మద్ధతు ఉందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని తెలిపారు.
తమ వ్యవస్థలు పేదవాడికి నమ్మకం, భరోసా ఇస్తున్నాయని స్పష్టం చేశారు.