కడప జిల్లాలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది.ఈ క్రమంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
పర్యటనలో భాగంగా కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారు.ప్రవీణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు మొత్తం 18 మందికి ములాఖత్ కు అనుమతించారు జైలు అధికారులు.
మరోవైపు లోకేశ్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.చిన్న ఘటన జరిగినా జిల్లా టీడీపీ నేతలదే బాధ్యత అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.