విశ్వంత్ దుద్దుంపూడి, సంతోష్ కంభంపాటిల `బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్` సెప్టెంబర్ 30న విడుదల

విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ `బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్`.స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె.

 Vishwanth Duddumpudi Boy Friend For Hire Movie Release Date Out Details, Vishwan-TeluguStop.com

నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై క్యురియాసిటీని పెంచింది.మధునందన్, సుదర్శన్, హర్ష వర్ధన్ ఇందులో కీలక పాత్రలు పోహిస్తున్నారు.ఈ చిత్రానికి గోపి సుంద‌ర్‌ సంగీతం అందిస్తుండగా, బాల స‌ర‌స్వతి సినిమాటోగ్రఫర్ గా, విజ‌య్ వ‌ర్ధన్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగ‌ణం:

విశ్వంత్ – మాళ‌విక స‌తీష‌న్‌ – పూజా రామ‌చంద్రన్‌ – హ‌ర్షవ‌ర్ధన్‌ – నెల్లూరు సుద‌ర్శన్- మధునంద‌న్‌, అమృతం అప్పాజీ – రాజా ర‌వీంద్ర – రూప ల‌క్ష్మి.

సాంకేతిక‌వ‌ర్గం:

ర‌చ‌న, ద‌ర్శక‌త్వం: సంతోష్ కంభంపాటి, నిర్మాత‌లు: వేణు మాధ‌వ్ పెద్ది, కె.నిరంజ‌న్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అశ్రిన్ రెడ్డి, సంగీతం: గోపి సుంద‌ర్‌, సినిమాటోగ్రఫి: బాల స‌ర‌స్వతి, ఎడిట‌ర్‌: విజ‌య్ వ‌ర్ధన్‌.కె, లిరిక్స్‌: ర‌హ‌మాన్‌, రాకేందుమౌళి, కొరియోగ్రాఫ‌ర్‌: విజ‌య్ ప్రకాశ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube