టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఈయన ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే కొన్నిసార్లు విశ్వక్ తన ప్రమేయం లేకుండానే వివాదాలలో నిలుస్తున్నారు.ఇకపోతే ఇటీవల ఈయన స్టార్ హీరో అర్జున్( Arjun ) దర్శకత్వంలో తన కుమార్తెతో కలిసి ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి.ఇక రెగ్యులర్ షూటింగ్ జరిపే సమయంలోనే ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడంతో అర్జున్ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ఇష్యూ చేశారు.

ఇకపోతే తాజాగా గామి( Gaami ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఉన్నటువంటి ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన అర్జున్ సినిమా ఘటన గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ హీరో అర్జున్ తన గురించి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఇష్యూ చేశారు అయితే ఆ ఇష్యూ వల్ల నేనే ఎక్కువగా నష్టపోయానని ఈయన తెలిపారు.

నా స్థానంలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో అయితే ఆయన అలా ప్రెస్ మీట్ పెట్టేవారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రెస్ మీట్ తర్వాత అర్జున్ గారు మా ఇంటికి వచ్చారని అయితే నేను ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్( Remuneration ) కంటే ఎక్కువగానే తనకు రిటర్న్ చేశాను అంటూ అర్జున్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తానేమి దొంగని కాదని ఆ ఇష్యూపై ఘాటుగానే స్పందించారు విశ్వక్ సేన్.
ప్రస్తుతం గామితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకొచ్చారు.







