శ్రావణ మాసం మొదలవడంతో ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావం బయటపడుతుంది.ఈ క్రమంలోనే శ్రావణమాసం సందర్భంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేస్తూ శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరిస్తారు.
సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ శ్రావణ శుక్రవారం వ్రతం నిర్వహిస్తుంటారు.ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ అభిమానులను సందడి చేసే విష్ణు ప్రియ శ్రావణ శుక్రవారం అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
శ్రావణమాసం మొదలవడంతో విష్ణు ప్రియ ఉదయమే నిద్రలేచి శ్రావణ శుక్రవారం పూజ నిర్వహించారు.అయితే ఈ పూజలో భాగంగా ఈమె సంప్రదాయ బద్ధంగా చీర ధరించి పూజ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ విధంగా విష్ణు ప్రియ చీర కట్టుకొని ఉన్న ఫోటోలు చూసిన అభిమానులు విష్ణు ప్రియ ఇలా చీరలో ఎంత పద్ధతిగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విష్ణు ప్రియా ఇదివరకే ఎన్నో పూజ కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే ఈమె గో సేవ చేయడం, తరచూ గుళ్ళకు వెళుతూ తనలో ఉన్న భక్తి భావాన్ని అప్పుడప్పుడు బయట పెడుతుంటారు.ఈ క్రమంలోనే శ్రావణమాసం కావడంతో విష్ణు ప్రియ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసినట్టు తెలుస్తుంది.ఇకపోతే ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం విష్ణు ప్రియ వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ విడుదల కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.







