మంచు మోహన్ బాబు కొడుకు గా విష్ణు( Vishnu ) ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.ఆయన ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కటి ఒక్కటి కూడా సరైన సక్సెస్ అయితే కొట్టలేకపోయాడు.
ఇక దానివల్ల ఆయన కెరీర్ అనేది చాలావరకు బ్యాడ్ ఫేజ్ లో నడుస్తుందనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు ప్రస్తుత 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాను( Kannappa Movie ) చేస్తున్నాడు.
ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరికి విచిత్రంగా అనిపించినప్పటికీ ఆయన మాత్రం చాలా ప్లాన్డ్ గానే ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా నటులందరినీ నటింప చేస్తున్నట్టుగా వర్థలైతే వస్తున్నాయి.ఇక మళయాళం నుంచి మోహన్ లాల్ అలాగే మధుబాల ఇక పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్( Prabhas ) కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం మీద అటు ప్రభాస్ గాని, ఇటు విష్ణు గాని స్పందించడం లేదు.
అయినప్పటికీ ఈ సినిమాలో పక్కాగా ప్రభాస్ శివుడు పాత్రను పోషిస్తున్నాడు అంటూ విష్ణు హింట్స్ అయితే ఇస్తున్నాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాకి రావలసిన అంత బజ్, కావాల్సినంత క్రేజ్ అయితే వచ్చేసింది.దాన్నిబట్టి ఈ సినిమా పాన్ ఇండియాలో( Pan India ) ఎంత మార్కెట్ ని కొల్లగొడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి మంచు విష్ణు ఈ సినిమాతో స్టార్ హీరోగా తనకు తాను మంచి గుర్తింపు పొందుతాడా లేదంటే ఈ సినిమాతో మరో ప్లాప్ ను దక్కించుకొని నష్టాలను చవిచూస్తాడా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…
.