విశాఖ పూర్ణానంద స్వామి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆశ్రమంలోని మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో మైనర్ బాలికలను నిద్రలేపి స్వామిజీ తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ క్రమంలోనే ఏడాది కాలంగా అత్యాచారం చేయడంతో మరో మైనర్ బాలిక గర్భం దాల్చిందని వెల్లడించారు.
ఆ బాలికను బంధువులు ఆశ్రమం నుంచి తీసుకెళ్లిపోయారని చెప్పారు.విచారణలో భాగంగా బాధిత బాలికలకు విజయవాడలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అదేవిధంగా నిందితుడు స్వామిజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.దీంతో స్వామిజీకి జూలై 5వ తేదీ వరకు రిమాండ్ విధించారు.