వెటరన్స్ డే సెలబ్రేషన్స్‌లో ‘21 గన్ సెల్యూట్‌’ను రద్దు చేసిన వర్జీనియా యూనివర్సిటీ

వర్జీనియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.వెటరన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా 21 తుపాకులను గాలిలోకి కాల్చే సాంప్రదాయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

తుపాకులను కాల్చడం వల్ల విద్యార్ధులు భయాందోళనలకు గురవుతున్నారన్న కారణంతోనే విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.దాదాపు పదేళ్ల నుంచి వర్జీనియా వర్సిటీలో ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది.

అమెరికాను ఎవరైనా ప్రముఖులు సందర్శించినప్పుడు సాయుధ బలగాలు తుపాకులను గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించడాన్ని మనం చూస్తూనే ఉంటాం.వర్జీనియా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి.

విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇది తరగతులకు విఘాతం కలిగించడం ఒకటైతే.రెండోది దేశంలో గన్ కల్చర్‌ కారణంగా జరుగుతున్న హింసతో విద్యార్ధుల్లో ఒకింత అభద్రతా భావం నెలకొనడం.

Advertisement

కాల్పుల శబ్ధం వినగానే క్లాస్‌రూమ్‌ల్లో ఉండే నిశ్శబ్ధ వాతావరణం బదులు కలకలం మొదలవుతుందని యూవీఏ అధ్యక్షుడు జిమ్ ర్యాన్ తన ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొన్నారు.

అయితే వర్సిటీ పూర్వ విద్యార్ధి జే లెవిన్ మాట్లాడుతూ.21 గన్ సెల్యూట్, సేవ చేసి మరణించిన వారికి అంతిమ నివాళి అని పేర్కొన్నారు.వర్సిటీ యాజమాన్యం అలాంటి నిర్ణయం తీసుకుందంటే తాను నమ్మలేకపోతున్నానని.

ఇది తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.కాగా జాగరణ మరియు వెటరన్స్ డే వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై.మంగళవారం ముగుస్తుందని వర్జీనియా యూనివర్సిటీ ప్రకటించింది.21 గన్స్ సెల్యూట్ అనేది వెటరన్స్ డే వేడుకలకు అనవసరమని.ఇవి కేవలం మనదేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన సాయుధ బలగాలకు ప్రత్యేకంగా అంకితం చేయబడ్డాయని కాబట్టి 21 గన్ సెల్యూట్‌ను వదిలి వేయాలని ర్యాన్ తెలిపారు.21 గన్ సెల్యూట్ బదులు ప్రత్యామ్నాయ మార్గాలను యూనివర్సిటీ పెద్దలు అన్వేషించాలని ఆయన సూచించారు.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..
Advertisement

తాజా వార్తలు