విరాట్ కోహ్లీ కఠోరమైన ఎక్స్‌సర్‌సైజ్‌.. ఆ వర్కౌట్ వీడియో వైరల్..

బాలీవుడ్ హీరోలా హ్యాండ్సమ్‌గా కనిపించే విరాట్ కోహ్లి తన ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాడు.ఈ స్టార్ క్రికెటర్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను ఫిదా చేస్తున్నాడు.

 Virat Kohli's Tough Exercise That Workout Video Is Viral , Virat Kohli, Work Out-TeluguStop.com

ఈ క్రికెటర్‌కి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఈ క్రికెటర్ ఫిట్‌నెస్ పెంచుకోవడానికి తాను చేసే వర్కౌట్స్‌కి సంబంధించి అప్పుడప్పుడు వీడియోల ద్వారా చూపిస్తుంటాడు.

ఇందులో భాగంగా తాజాగా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు.ఈ వీడియోలో అతను బరువులు ఎత్తడం కనిపించింది.

హ్యాండ్సమ్ స్టార్ వైట్ షూస్‌, బ్లాక్ బనియన్, లైట్ బ్రౌన్ కలర్ షార్ట్‌ను ధరించాడు.అతను జిమ్ ఔట్‌ఫిట్‌లో చాలా హాట్‌గా కనిపించాడు.ఈ భారీ బరువులు చాలా ఈజీగా లిఫ్ట్ చేసాడు.తద్వారా తన అభిమానుల్లో ఫిట్‌నెస్ గోల్స్ పెంచేసాడు. “మొబిలిటీ ఈజ్ కీ.” అని ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించాడు.ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022కి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియాలో ఈ ఈవెంట్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది.ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడేందుకు రోహిత్ శర్మ కో చాలా ముందుగానే అక్కడికి వెళ్లారు.

రెండవ ప్రాక్టీస్ గేమ్‌కు ముందు, బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ వ్యాయామ వీడియోను షేర్ చేశాడు.ఈ వీడియోలో కోహ్లీ జిమ్‌లో కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటూ, బిగ్ టోర్నమెంట్‌కు తనను తాను సిద్ధం చేసుకోవడం చూడవచ్చు.కోహ్లీ వర్కౌట్‌ను షూట్ చేసిన తన సహచరుడు సూర్యకుమార్ యాదవ్‌కు కూడా అతను క్రెడిట్ ఇచ్చాడు.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube