కోహ్లీ వీరాభిమాని... ఒంటినిండా పచ్చబొట్లు

ఇండియాలో ఎక్కువ క్రేజ్ ఇచ్చేవి క్రికెట్, సినిమా, ఈ రెండు రంగాలలో ఉన్నవారికి విపరీతంగా అభిమానులు ఉంటారు.

ఓ విధంగా చెప్పాలంటే కొంత మందికి అభిమానులు కంటే ఆరాధించేవారు ఉంటారు.

ఇక తమ అభిమాన నటుడు, లేదా క్రికెటర్ కోసం ఏం చేయడానికి అయిన సిద్ధం అయిపోతారు.ఇక ఒక్కసారైనా తమ హీరో దృష్టిలో పడకపోతామా అనే ఆశతో ఉంటారు.

ఇలా ఇండియన్ క్రికెట్ లో సచిన్, ధోనికి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.వారిలో కొంత మంది ఆరాధించేవారు కూడా ఉన్నారు.

ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ క్రికెట్ లో కోహ్లికి ఆ క్రేజ్ దక్కింది.ప్రస్తుతం యువతలో అతనికి విశేషమైన క్రేజ్ ఉంది.

Advertisement

అలాంటి క్రేజీ అభిమాని ఈ రోజు మ్యాచ్ జరుగుతున్నా కటక్ లో బారాబతి స్టేడియంలో అందరి దృష్టిని ఆకర్షించాడు.మ్యాచ్‌ను చూడటానికి వచ్చేవారిని కోహ్లి క్రీడాభిమాని పింటూ బెహెరా తనకి టీమిండియా కెప్టెన్ మీద ఏ స్థాయిలో అభిమానం ఉందో చూపించాడు.

కోహ్లీపై ఇష్టంతో శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు.ఈ టాటూలలో కోహ్లీ ఫొటోలతో పాటు అతను ధరించే జెర్సీ నెం.18 కూడా ఉంది.ఇక తనకి కోహ్లి మీద ఉన్న అభిమానాన్ని ఇతరు మీడియాతో పంచుకున్నాడు.

అతని ఆటకి, స్టైల్ కి తాను వీరాభిమాని అని ఈ టాటూల కోసం లక్ష రూపాయిల వరకు ఖర్చు చేశానని చెప్పాడు.గత అక్టోబర్‌లో కోహ్లీని కలిసిన విషయాన్ని గుర్తు చేసుకుని మురిసిపోయాడు.

వైజాగ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ సమయంలో కోహ్లీని కలిశానని, 2016 నుంచి అనుకుంటుంటే అప్పుడు సాకారమైందని తెలిపాడు.మొత్తానికి ఈ కోహ్లి అభిమాని తన టాటూలతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు