వైరల్: ఈ దివ్యాంగ బాలుడిని చూసి నేర్చుకోండి... అన్ని అవయవాలు ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నారు!

అవును.ఇక్కడ మనకు వీడియోలో కనిపించే దివ్యాంగ బాలుడిని చేస్తే ఎంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

అన్ని అవయవాలు సరిగ్గా ఉండి, ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో వుంటారు అనేకమంది.కానీ మనలో అవయవాలు సరిగ్గా పనిచేయని కొంతమంది మనో ధైర్యంతో తమ బలహీనతలను కూడా బలంగా మార్చుకొని జీవిస్తారు.

Viral: Watch This Disabled Boy And Learn What Can He Do Even With All His Limbs

మనచుట్టూ చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూసి కుమిలిపోయే వాళ్లు చాలామందే ఉన్నారు.అలాంటి వారు ఈ ఇన్‌స్పిరేషనల్‌ వీడియో కచ్చితంగా చూసి తీరాల్సిందే.

ఈ వీడియో చూసిన తర్వాత మీలో మళ్లీ పాజిటివ్ ఎనర్జీ తప్పక కలుగుతుంది అనుకుంటున్నాము.ఇక్కడ సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగ బాలుడు తన రోజువారీ కార్యక్రమాలను ఎంత ఈజీగా చేసుకుంటున్నాడో మనం గమనించవచ్చు.

Advertisement

స్కూల్‌లో పిల్లలందరితో పాటు భోజనం చేయడానికి కూర్చున్న ఆ పిల్లాడు రెండు చేతులు లేకున్నా.నోటితో, చెంచాతో సునాయాసంగా తినడం మనం చూడవచ్చును.

అలాగే కాళ్లు లేకున్నా తోటి విద్యార్థులతో కలిసి సందడి చేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.బేసిగ్గా మనలో అనేకమంది స్ఫూర్తి కోసం ముందుగా మహానుభావులు అయినటువంటి మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా వంటి వ్యక్తులను గుర్తుకు తెచ్చుకుంటూ వుంటారు.

కొన్నిసార్లు మనం మన చుట్టూ వుండే వ్యక్తులనే చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.ఈ కోవకే చెందుతాడు ఈ దివ్యాంగ బాలుడు.

సదరు వీడియోని చూసిన నెటిజన్లు నిజంగా స్ఫూర్తి పొందుతున్నారు.దేవుడు మాకు అన్యాయం అన్యాయం చేసాడు అనుకొనే వారికీ ఈ చిన్నారి ఇన్‌స్పిరేషన్‌ అని ఒకరెంటే, జీవితంలో నిరాశా, నిస్పృహలతో బతికే వారు ఈ వీడియోను చూడండి.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ఖచ్చితంగా మారుతారు.అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం మనం చూడవచ్చును.

Advertisement

తాజా వార్తలు