వైర‌ల్ వీడియో.. ఈ కోతి ఏంటి స్పైడ‌ర్‌లాగా ఎగురుతోంది..

కోతి చేష్ట‌లు అంటే మామూలుగా ఉండ‌వని మ‌నంద‌రికీ తెలిసిందే.అవి చేసే అల్ల‌రి ఒక్కోసారి క‌డుపుబ్బా న‌వ్విస్తుంటే మ‌రి కొన్ని సార్లు మాత్రం చిరాకు తెప్పిస్తోంది.

ఇంకొన్ని సార్లు అయితే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.ఇక ఇప్పుడు కూడా ఓ కోతి చేసిన ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.ఇక సోష‌ల్ మీడియాలో రాకుండా ఉంటుందా.

అస‌లే ఈ మ‌ధ్య కోతుల‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.ఒక‌టి వండ‌ర్ ఫుల్ అనుకునే లోపే మ‌రో వీడియో దాన్ని మించి వైర‌ల్ అవుతోంది.

మ‌రీ ముఖ్యంగా ఇలాంటి అడ్వెంచ‌ర్‌కు సంబంధించిన వీడియోల‌కు జనం సంబర పడిపోతున్నారు.ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోల‌కు వ్యూస్ ఓ రేంజ్‌లో వ‌స్తున్నాయి.

Advertisement

ఇప్పుడు కూడా ఓ కోతి త‌న‌కేదో అడ్వెంచ‌ర్ ఛాలెంజ్ ఇచ్చిన‌ట్టు లేదంటే తానేదో అడ్వెంచ‌ర్ రియాలిటీ షోలో పాల్గొన్న‌ట్టు తెగ సంద‌డి చేస్తోంది.ఇక ఆ కోతి చేసిన అల్ల‌రి ప‌నుల‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

అయితే కోతులు స‌హ‌జంగా గోడలు దూకడం లేదంటే చెట్లు ఎక్కడం చాలా కామ‌న్ గా చేస్తుంటాయి.కాక‌పోతే ఇప్పుడు ఇది కాస్త ఎక్కువైంది.

ఇప్పుడు మ‌నం చూసే వీడియోలో ఓ కోతి స్పైడర్ మ్యాన్ లాగా గోడను అమాంతం ఎక్కేస్తుంది.అయితే అక్క‌డ గోడ‌కు ఎక్కేందుకు ఎలాంటి వీలు లేక‌పోయినా కూడా సేమ్ స్పైడర్ మ్యాన్ లాగే త‌న చేష్ట‌లు ఉన్నాయి.గోడ నిఠారున ఉండ‌టంతో అమాంతం ఆ గోడపై అతుక్కుని పోతూ దాన్ని ఎక్కడాన్ని మ‌నం గ‌మ‌నించొచ్చు.

ఏ కోతి అయినా స‌రే ఇలాంటి ఓ గోడ‌ను ఎక్క‌డం అనేది చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి.ఎలాంటి ఆధారం లేక‌పోతే ఇంత‌లా సామ‌ర్థం తెచ్చుకుని ఆ కోతి ఎక్కుతోందంటే అది వైర‌ల్ కాకుండా ఉంటుందా మ‌రి.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు