గత 4 నెలలుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం సోనసాగుతూనే వుంది.అతి పెద్దదైన రష్యా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్నా, ఉక్రెయిన్ సైన్యం మాత్రం ధీటుగా వారికి జవాబిస్తోంది.
ఈ క్రమంలో ఆ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది.ఇలాంటి యుద్ధ వాతావరణంలోనే ఓ సైనిక ప్రేమ జంట ఆదేశ మిలిటరీ దుస్తుల్లోనే ఒక్కటైంది.
అలాంటి విపత్కర పరిస్థితులలో ఒక్కటై యుద్ధం ఏమాత్రం తమ పెళ్లికి అడ్డురాదని నిరూపించారు.ఎలాంటి ఆర్బాటాలు, ఆడంబరాలకు పోకుండా ఆర్మీ దుస్తుల్లోనే నవ దంపతులు ఒక్కటవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిని చూసిన నెటిజన్లు ఈ రకంగా స్పందిస్తున్నారు.యుద్ధం ప్రేమికులను విడదీయలేదని ఒకరు కామెంట్ చేయగా, యుద్ధమే వీరి ప్రేమకు సాక్షి అని వేరొకడు కామెంట్ చేసాడు. సైనిక దుస్తుల్లోనే ఒక్కటైన వధూవరులిద్దరూ చర్చి నుంచి బయటకు రాగా.
బంధు మిత్రులు కేరింతలు కొడుతూ వారికి స్వాగతం పలకడం మనం ఈ కింది వున్న వీడియోలో చూడవచ్చు.దీనికి సంబంధించి ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆంటోన్ గెరాశ్చన్కో ట్విట్టర్‌లో సదరు వీడియోని షేర్ చేసారు.
దాంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో వివాహాలు ఈ విధంగానే జరుగుతున్నాయి.తెల్లటి దుస్తులు ఇక్కడ లేవు.ఆర్బాటం అస్సలే లేదు.
కానీ వారి మనసుల నిండా ప్రేమ దాగి ఉందంటూ మంత్రి తన పోస్టులో పేర్కోవడం విశేషం.ఇదిలాఉంటే.
యుద్ధం ప్రారంభమైన తొలిరోజుల్లో కూడా ఓ ప్రేమ జంట రణ క్షేత్రంలోనే సైనిక దుస్తుల్లోనే ఒక్కటవ్వడం టాక్ అఫ్ ది టౌన్ గా మారడం మనకు తెలిసినదే.మార్చి 6న ఉక్రెయిన్లోని కీవ్‌లో 112 బ్రిగేడ్‌కు చెందిన సైనికులు లెసియా, వాలెరీ ఫైలిమోనివ్ వివాహం చేసుకున్నారు.
అప్పుడు కూడా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.







