వైరల్: ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే ...!

మనం సాధారణంగా అయితే రన్నింగ్ బస్ ని.రన్నింగ్ ట్రైన్ ని ఎక్కడం చూస్తుంటాం.

మహా అయితే కొందరు రన్నింగ్ బస్ లో నుండి వేరొక బస్ లోకి మారడం.పక్కపక్కనే ఉంటే కొందరు ఒక ట్రైన్ నుండి మరో ట్రైన్ లోకి మారడం చూస్తుంటాం.

ఇక ఒక బస్ డ్రైవర్ లు డ్యూటీలు మారడం చూస్తుంటాం.అయితే ఇక్కడ ఇద్దరు పైలెట్లు కూడా తమ డ్యూటీలు మారాలనుకున్నారు.

అయితే.అందరికంటే భిన్నంగా గాల్లో వుండగానే ఒకరి విమానం నుంచి మరొకరి విమానంలోకి మారాలని అనుకున్నారు.

Advertisement
Viral Video Two Pilots Try To Swap Plane In Mid Air Details, Viral Latest, Vira

రన్నింగ్ ట్రైన్ ఎక్కినట్టు. రన్నింగ్ లో ఉన్న బస్ ఎక్కినట్టు గాల్లో ఉన్న విమానం లోకి రావడానికి ప్రయత్నించారు.

ఇద్దరు పైలెట్స్ ల్యూక్ ఐకిన్స్, ఆండీ ఫారింగ్‌టన్ లు మొదటిసారిగా గాల్లో ఉండగానే ఒక విమానం నుండి మరో విమానం లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.అయితే ఈ ప్రయోగంలో కేవలం ఐకిన్స్ అనే పైలెట్ మాత్రమే ఆండీ విమానంలోకి సురక్షితంగా ప్రవేశించి.

విమానాన్ని అరిజోనా ఎడారిలో సేఫ్ గా ల్యాండ్ చేశాడు.అయితే ఫారింగ్‌టన్ మాత్రం ఐకిన్స్ విమానంలోకి ప్రవేశించలేకపోయాడు.

కానీ, పారాచూట్ సాయంతో ఏ అపాయం కలగకుండానే కిందకి దిగగా.అతను ప్రవేశించాల్సిన విమానం కూలిపోయింది.

Viral Video Two Pilots Try To Swap Plane In Mid Air Details, Viral Latest, Vira
షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు

ఐకిన్స్, ఫారింగ్టన్‌లకు విమానం నడపడంలో ఎంతో అనుభవం ఉంది.వీరిద్దరూ గత కొంతకాలంగా గాల్లో నుంచి విమానాలను మారేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు.ఒకే ఎత్తులో ఎగురుతూ విమానాలు మారాలనేది వీరి ఆలోచన.

Advertisement

కానీ, గాల్లోకి ఎగిరిన తర్వాత వారి ప్లాన్ బెడిసికొట్టింది.అయితే, ఐకిన్స్ విజయవంతంగా మరో విమానంలోకి ప్రవేశించగలడంతో మరోసారి తమ ప్రయత్నం ఫలిస్తుందని నిర్వాహకులు అంటున్నారు.

వీరు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసి తమకు వెన్నులో వణుకు పుట్టిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు