టీవీలో మాంసం చూసి టెంప్ట్ అయిన అమాయక కుక్క.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు!

ఒక్కోసారి మూగ జీవాలు చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి.మరికొన్ని సార్లు అవి చేసే పనులకు అయ్యో పాపం అనాల్సి వస్తుంది.

 Viral Video Seeing Meat On Tv Dog Started Licking Funny Video Details, Tv, Tempt-TeluguStop.com

తాజాగా ఓ శునకం చేసిన పనికి నవ్వుతో పాటు అయ్యో అంటూ జాలి చూపిస్తున్నారు నెటిజన్లు.సోషల్ మీడియాలో ఈ శునకానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఓ యజమాని తన శునకాలతో కలిసి టీవీ చూస్తుండగా టీవీలో ఒక యాడ్ వచ్చింది.ఆ ప్రకటనలో మాంసం ముక్కలు కనబడగా అవి నిజమైన మాంసం ముక్కలుగా శునకం అనుకుంది.

వాటిని చూడగానే దానికి బాగా నోరూరింది.అంతే, ఆ మాంసాన్ని నోటకరచుకొని ఆవురావురుమంటూ తినాలని టీవీ దగ్గరకు వెళ్లి టీవీ స్క్రీన్‌ను నాకింది.

పాపం అది నిజమైన మాంసం కాదు అని అప్పటికీ గానీ తెలిసి రాలేదు ఆ శునకానికి.

ఎంత సేపు నాకినా స్క్రీన్ వేడి నాలుకకి తగులుతుందే తప్ప మాంసం రుచి మాత్రం తగలలేదు.

దీనితో “ఎంత సేపు నాకినా ఈ మాంసం తినలేకపోతున్నాను ఏంటి” అనుకుంటూనే ఆ కుక్క టీవీ స్క్రీన్‌ని చాలా స్పీడ్ గా నాకేసింది.చివరికి అది తినగలిగే మాంసం కాదని కుక్కకి అర్థం అయ్యింది.

టీవీల్లో కనిపించే వాటిని చూసి కుక్కలు నిజమే అనుకోవడం ఇదే మొదటిసారి కాదు.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన డాగ్ హాస్కీ జాతికి చెందినదని తెలుస్తోంది.

దీన్ని కొనుగోలు చేయాలంటే ఇండియాలో కనీసం 50 వేల రూపాయలు చెల్లించాల్సిందే.ఎందుకంటే ఇవి చాలా స్మార్ట్ గా ఉంటాయి.ఈ మొత్తం వ్యవహారాన్ని యజమాని తన సెల్‌ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కొందరు నెటిజన్లు శునకం చేసిన పనికి నవ్వుకోగా. మరికొందరు మాత్రం ‘అయ్యో పాపం, అది నిజమైన మాంసం కాదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు 90 లక్షల మంది వీక్షించగా 65 వేల మంది లైక్ చేసారు.

అయితే ఈ ఫన్నీ ఘటన చైనాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube