వీడియో: అచ్చం మనిషిలాగే ఉన్న రోబో.. డ్యాన్స్ చేస్తూ మరీ వడ్డిస్తోందిగా..!

ఈ మధ్య రెస్టారెంట్లు, కేఫ్‌లలో రోబోలు( Robots ) వర్క్ చేయడం చాలా కామన్‌గా మారింది.వడ్డించడం, వంటలు తయారు చేయడం లాంటి పనులన్నీ చేసేస్తున్నాయి.

దీంతో మానవులు చేసే పనుల్లో చాలా మార్పులు వస్తున్నాయి.ఇటీవల ఒక రోబో ఓ చైనీస్ రెస్టారెంట్‌లో( Chinese Restaurant ) వెయిట్రెస్‌ గా పని చేస్తూ ఆశ్చర్యపరిచింది.

ఇది అచ్చం మనిషి లాగానే ఉంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఆహారం వడ్డించడం, మెనూలు ఇవ్వడం లాంటివి మానవుడు చేసే పనులన్నీ అది కూడా చేస్తోంది.

Advertisement

కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే.ఆ రోబో చాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తుంది! డ్యాన్స్ చేసేటప్పుడు దాని మాటలు కూడా కంప్యూటర్ లాగా మారిపోతాయి.సాంకేతికతతో పాటు వినోదాన్ని కూడా కలిపి చూపించడంతో ఈ వీడియో చాలా పాపులర్ అయింది.

దీనిని @balakrishnanrbk అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.అందులో వెయిట్రెస్ రోబో( Robot Waitress ) డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు సేవలందించడం చూడవచ్చు.

ఈ క్లిప్‌లో ఉన్న రెస్టారెంట్‌ చాంగ్‌కింగ్‌ సిటీలో ఉంది.రోబో డ్యాన్స్ మాత్రమే కాదు, కంప్యూటర్ లాగా మాట్లాడటం కూడా నేర్చుకుంది.

ఈ వీడియో వారం క్రితం షేర్ చేయగా ఇప్పటికే దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.కొంతమంది ఈ రెస్టారెంట్ యజమాని ఆలోచన చాలా బాగుందని అంటున్నారు, మరికొందరు దీన్ని వింతగా భావిస్తున్నారు.కొంతమందికి ఇది ఫన్నీగా అనిపిస్తే, మరికొందరికి క్యూట్‌గా అనిపించింది.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

సాంకేతికతతో మానవ నైపుణ్యాలను మిళితం చేస్తే ఎంత అద్భుతమైన సృజనాత్మకతను సాధించగలమో ఈ డ్యాన్సింగ్ రోబో వెయిట్రెస్ వీడియో చూపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు