రోజులు గడుస్తున్న కొద్దీ టెక్నాలజీ( Technology ) మరింత అడ్వాన్స్డ్ గా మారిపోతుంది.దీనివల్ల ప్రజలకు ఉపయోగాలే కాకుండా నష్టాలు కూడా కలుగుతున్నాయి.
ముఖ్యంగా రోబోలు యజమానుల ఖర్చులను ఆదా చేస్తున్నాయి.అనేక పనులను కూలీలపై ఆధారపడకుండా పూర్తి చేసుకోవడంలో సహాయం చేస్తున్నాయి.
దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్( Elon Musk ) కూడా రోబోట్స్ తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మనుషుల సహాయం లేకుండా వ్యవసాయంలో వాటంతటవే పనిచేయగల రోబోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ముఖ్యంగా ఒక వీడియో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో రోబోలు( Robots ) పంట పొలంలోకి దిగి వరి నాట్లు వేయడం, వరి పంట కోయడం వంటి పనులు చేస్తున్నాయి.సాధారణ మనుషుల లాగానే అవి మడిలోకి దిగి వ్యవసాయ పనులను( Agriculture Works ) వేగంగా పూర్తి చేస్తున్నాయి.వీటిని చూస్తే చాలా ఆశ్చర్యమేసింది.ఇటీవల కాలంలో పొలంలో పనులు చేసేవారు ఎక్కువగా దొరకడం లేదు.ఈ కార్మికుల కొరత రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది.
దీనివల్ల రైతన్నలు బాగా ఇబ్బందులు పడుతున్నారు.అలాంటివారికి ఈ మరమనుషులు అండగా నిలుస్తాయని చెబుతూ ఈ వీడియోని ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.
దీనికి 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

అయితే ఈ వీడియో చూసిన చాలా మంది రోబోల కంటే సమర్థవంతంగా పనిచేసే, తక్కువ ధరల్లో దొరికే వ్యవసాయ పరికరాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.అయితే రోబోల మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ అని ఇంకొందరు అన్నారు.మనుషులైతే కూలీలు ఇవ్వాలి, వాహనాలతో నడిచే వ్యవసాయ పరికరాలకు లీటర్ల చొప్పున ఖరీదైన ఇంధనం పోయాలి, అదే రూపాయలు అయితే సింపుల్ గా చార్జింగ్ పెడితే సరిపోతుంది, దానికి ఎక్కువగా ఖర్చు కూడా అవ్వదు అని నెటిజన్లు తెలుపుతున్నారు.
అయితే ఈ వీడియోలో కనిపించిన రోబోలు నిజమైనవా కాదా అనేది ఇంతవరకు తెలియ రాలేదు.







