వైరల్ వీడియో: తన పిల్లల ముచ్చట తీర్చడానికి ఏకంగా తన క్రియేటివిటీతో రెడీ అయిన బుల్లి మహీంద్ర జీపు..!

చిన్నపిల్లలు వారు ఆడుకోవడం కోసం తల్లిదండ్రులను బొమ్మలు కొనడం మనం తరచూ చూసే విషయమే.

అయితే వారు అడిగిన బొమ్మలను తల్లిదండ్రులు వారి స్తోమతకు తగ్గట్టుగా కొని చిన్నపిల్లలు పొందే ఆనందాన్ని చూసి తెగ మురిసిపోతుంటారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ని తన పిల్లలు ఆట బొమ్మలు అడిగారన్న ఉద్దేశంతో.

ఎవరు చేయని పని చేసి ఓ అడుగు ముందుకేశాడు.ఇందులో భాగంగానే తన క్రియేటివిటీని ఉపయోగించి వారి పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా అచ్చం జీప్ పోలి ఉన్న బుల్లి జీప్ ను ఏర్పాటు చేసి వార్తల్లో ఎక్కేసాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఉన్న ఆర్ కోడ్ ప్రాంతంలో ఉన్న షకిర్ తన పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా ఓ చిన్న మహేంద్ర జీప్ ని తయారు చేసే అందించాడు.

Advertisement
Viral Video Kerala Man Builds A Miniature Mahindra Jeep For His Kids , Viral Vid

అయితే ఇందుకు అవసరమైన వాటిని ముందుగా సిద్ధం చేసి వాటిని సరైన పద్ధతిలో అమర్చి పిల్లల చేతిలో పెట్టడంతో వారి పిల్లలు దానితో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఆయన తయారు చేసిన బుల్లి జిప్ సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video Kerala Man Builds A Miniature Mahindra Jeep For His Kids , Viral Vid

ఆయన తయారు చేసిన మహీంద్రా జీప్ ప్రతిరూపమైన ఈ జీప్ కి 1000 వాట్స్ కలిగి ఉన్న మోటర్ ని అమర్చారు.అంతేకాదు ఈ జీప్ కి పవర్ స్టీరింగ్, మ్యాన్యువల్ గేర్ బాక్స్, అలాగే వేరు చేయగలిగిన సాఫ్ట్ అలాగే హెడ్ లైట్స్ లాంటి వాటిని అచ్చం నిజమైన జీపులో ఉన్న లాగే దీనికి కూడా అమర్చాడు.అయితే దీనిని తయారు చేయడానికి అతనికి ఏకంగా సంవత్సర కాలం పట్టింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో తాను ఎలాంటి వాటిని ఉపయోగించానన్న విషయాలను నవ్వులు చిందిస్తూ తెలియజేశాడు.ఈ జీపు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ని ఈ జీప్ తయారు చేయడానికి తనకి ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చయిందని తెలియజేశాడు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూడండి.

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు
Advertisement

తాజా వార్తలు