ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది అభిమానులు రష్మిక మందన్నా పేరును సమాధానంగా చెబుతున్నారు.స్టార్ హీరోల సినిమాల్లో రష్మిక ఇప్పటికే నటిస్తుండగా పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో సైతం రష్మికకే ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.
జుట్టుతో ఎప్పుడూ అందంగా కనిపించే రష్మిక గుండులో కనిపిస్తే మాత్రం ఆమె అభిమానులు అస్సలు తట్టుకోలేరు.
అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ నటి టాలీవుడ్ తో బాలీవుడ్ లో నటిస్తుండగా తాజాగా ఈ బ్యూటీ గుండు లుక్ లో దర్శనమిచ్చారు.
రష్మిక మందన్నా గుండు లుక్ సినిమా కోసమో లేక వ్యాపార ప్రకటన కోసమో అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.కొందరు తమ వ్యాపారం కోసం ఆమె గుండు ఫోటోలను ఉపయోగించుకుంటున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని సెలూన్ల ముందు గుండు లుక్ లో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
సాధారణంగా సెలూన్ల కోసం హీరోల ఫోటోలను ఉపయోగించుకోవడం ఎక్కువగా జరుగుతుంది.
అలా కాకుండా తమిళనాడులో రష్మిక ఫోటోలను ఉపయోగించుకోవడం గమనార్హం.రష్మిక గుండు ఫోటోలను చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.
రష్మిక గుండు ఫోటోపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.శాండిల్ వుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సక్సెస్ లు సొంతం చేసుకున్న రష్మిక సుల్తాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో రష్మికకు నిరాశ ఎదురైంది.బాలీవుడ్ లో రష్మిక రెండు సినిమాల్లో నటిస్తుండగా ఒక సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
రష్మిక అందంగా లేని ఫోటోలను సెలూన్లలో వినియోగిస్తుండటంపై రష్మిక ఫ్యాన్స్ అభ్యంతరం చెబుతుండటం గమనార్హం.కొంతమంది సెలూన్ వ్యాపారులు ఫోటోలను వినియోగించుకుంటూ ఉండటంపై రష్మిక ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.