Viral video : వైరల్ వీడియో: అరే ఏంట్రా ఇది.. ఇలా కూడా సంపాదించవచ్చా..?!

ప్రస్తుత రోజుల్లో మనిషి బతకాలంటే కేవలం గాలి, నీరు, తిండి మాత్రమే కాదు.అసలైనది డబ్బు.

నిజానికి డబ్బు ఉంటే ప్రతి పని కూడా ఇంట్లో ఉండే ఇట్లే పూర్తి చేయవచ్చు.మనిషి జీవితానికి డబ్బు ఓ ఇందనంలా మారిపోయింది.

సమాజంలో కూడా మనిషికి డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే అంత గౌరవం ఇస్తారు.లేదంటే సొంతవారైనా సరే చులకనగా చూసే రోజులువి.

డబ్బు సంపాదించడం కోసం వ్యాపారాలు చేయడం, ఉద్యోగాలను చేయడం లాంటివి చేస్తుంటాం.అయితే కొందరు మాత్రం చిత్ర విచిత్ర పనులు చేసి కూడా డబ్బులను చాలా సులువుగా సంపాదిస్తుంటారు.

Advertisement

వారి ఐడియాలను చూస్తే ఇంత సులువుగా డబ్బు సంపాదించవచ్చా అనే సందేహం కచ్చితంగా వస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఈ భావన కలగడం గ్యారంటీ.

ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దామా.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో బంగ్లాదేశ్( Bangladesh ) దేశంలోని డాఖా - చిట్టాగాంగ్ ( Dhaka - Chittagong )జాతీయ రహదారిలోని ఓ ప్రాంతంలో చిత్రీకరించబడింది.ఈ వీడియోలో పూర్తిగా గమనించట్లయితే జాతీయ రహదారి పక్కన ఓ బస్ స్టాప్ ఉండగా అందులో వ్యక్తులు దిగిన వెంటనే రోడ్డు దాటేందుకు సుదూరం నడుచుకుంటూ వెళ్లకుండా ఉండేందుకు.అక్కడ కొందరు అడ్డంగా ఉన్న డివైడర్ ను చాలా సులువుగా దాటి చేస్తున్నారు.

అయితే వాళ్లు ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నారనుకుంటే మాత్రం పొరపాటే.అలా డివైడర్ ను దాటిన వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని మరి ఈ ఘనకార్యాన్ని తలపెడుతున్నారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

డాఖా - చిట్టాగాంగ్ జాతీయ రహదారిపై బస్ స్టాప్ పక్కన డివైడర్ చాలా ఎత్తుగా ఉంది.అయితే ప్రయాణికులు డివైడర్ దాటి వెళ్లాలంటే కొద్దిదూరం నడవాల్సి ఉంది.నిజానికి అది చాలా పెద్ద సమస్యగా మరిన్ని ఆ ప్రాంత ప్రజలకి.

Advertisement

ఆ జాతీయ రహదారి ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి.అయితే ఇదే అవకాశాన్ని కొందరు వ్యక్తులు డబ్బులు సంపాదచే విధంగా ఎంచుకున్నారు.

దీంతో డివైడర్ కు ఇరవైపులా చిన్నపాటి నిచ్చినలువేసి ప్రయాణికులను డివైడర్( Divider ) ను దాటిచేస్తున్నారు.ఇందుకుగాను వారి నుండి డబ్బులను కూడా తీసుకోవడం కొసమెరుపు.

అయితే ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ఆ ప్రాంత పోలీసులు దాన్ని చూడడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

ఈ దందాను నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నిచ్చెనలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.అదేవిధంగా డివైడర్ సమస్యను కూడా స్థానిక అధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వగా.

అధికారులు పరిష్కార మార్గం త్వరలో చేపడతామని తెలిపారు.

తాజా వార్తలు