మనుషుల జీవితాల్లో కుక్కలు ఒక భాగం అయిపోయాయి.కాపలా కోసమో లేదా ఒంటరితనాన్ని పోగొట్టేందుకు చాలామంది కుక్కలతోనే సావాసం చేస్తున్నారు.
వాటిని ప్రేమగా పెంచుతూ తమ కుటుంబ సభ్యులు గా భావిస్తున్నారు.ఆ స్థాయిలో కుక్కలకు, మనుషులకు మధ్య అనుబంధం చిగురించింది.
అయితే కుక్కలు కూడా మనుషుల రుణాన్ని తీర్చుకుంటున్నాయి.ఇంట్లో దొంగలు పడకుండా, పాములు రాకుండా, ఇంకా యజమానులకు ఏ హాని కలగకుండా కాపాడుతున్నాయి.
అంతేకాదు ఇంటి పనులు కూడా చేస్తూ గొప్ప పేరు తెచ్చుకుంటున్నాయి.కాగా తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియోలో కూడా ఒక కుక్క చక్కగా ఇంటి పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
పప్పీస్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సూపర్ వైరల్ గా మారింది.ఈ వీడియోలో కనిపించే శునకం పేరు సీక్రెట్ కాగా.దాని ఓనర్ నేమ్ మేరీ.ఈ సీక్రెట్ డాగ్ చాలా తెలివైనది.
ఓనర్ చెప్పిన మాట వెంటనే వింటుంది.ఇంట్లోని అన్ని పనులూ చేస్తుంది.
అలసిపోకుండా ఓనర్ కి సహాయం చేస్తూ ఈ కుక్క అందరి ప్రశంసలు పొందుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో బట్టలు ఉతకడంలో మేరీకి సీక్రెట్ డాగ్ హెల్ప్ చేయడం చూడొచ్చు.బట్టలు ఆరిన అనంతరం వాటిని ర్యాక్‌లో కూడా ఈ కుక్క పెట్టింది.యజమాని తో సరి సమానంగా అది పనులను పంచుకుంటూ ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో పోస్ట్ చేసిన సెకండ్లలోనే వైరల్ గా మారింది.ఈ క్లిప్ పై నెటిజనులు “వావ్, సూపర్.
ఇలాంటి డాగ్ మాకు కావాలి” అని కామెంట్లు పెడుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.







