సింహాన్నే ఎదిరించిన జింక.. వెంట్రుకలు నిక్కబొడిచే వీడియో వైరల్..

ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ రెండు లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలి.జంతువులను కూడా ఈ రెండు లక్షణాలే కాపాడతాయని అనడంలో సందేహం లేదు.

 Viral Video Deer Scared Lion,deer,lion,deer Lion Video,social Media,viral Video,-TeluguStop.com

తాజాగా ఈ రెండు లక్షణాలు గల ఒక జింక అదే విషయాన్ని నిరూపిస్తోంది.దీనికి సంబంధించిన వీడియోను @TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.“ధైర్యాన్ని చూపిస్తే మీరు కూడా బలవంతులే అనే సంగతి తెలుస్తుంది.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక జింక నీటిలో ఉండటం మనం గమనించవచ్చు.దాని ముందే ఒక పెద్ద సింహం కనిపించింది.ఆ నీటిలోనేమో ఒక పెద్ద మొసలి ఉంది.అదే జింకపై ఒక్కసారిగా అటాచ్ చేసింది.

దాంతో ఉలిక్కిపడిన జింక( Deer ) వెంటనే దాని నుంచి ఎలాగోలా తప్పించుకుంది.కానీ దాని ముందే ఉన్న సింహం దీన్ని చంపేసి తిందామని చూసింది.దాంతో జింక ప్రాణాలు పోయినట్లేనని వీడియో చూస్తున్న వారు అనుకున్నారు.కానీ జింక ఊహించని ఓ పని చేసింది.అదేంటంటే సింహాన్ని( Lion ) ఎదిరించింది.ఆ జింక ముందు అడుగులు వేస్తుంటే సింహం వెనకడుగులు వేసింది.

ఈ సీన్ చూసేందుకు నమ్మశక్యంగా లేదు.జింక తనను ఏదో ఆవహించినట్లు అది ప్రవర్తించింది.

దేన్నైనా ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని అది చూపించింది.

దాని ధైర్యం చూసే సింహం భయపడింది.అది కొమ్ములతో కుమ్మేయడానికి దూసుకొస్తున్నప్పుడు సింహం పారిపోయింది.మొత్తం మీద ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.

ఇది చూసి నెటిజన్లు( Netizens ) స్టన్ అవుతున్నారు.ఇంతకుముందు శాఖాహార జీవులు ఇలానే ధైర్యంగా ప్రవర్తించి సింహాలకు చుక్కలు చూపించాయని అంటున్నారు.

వాటికి సంబంధించిన వీడియోలు( Viral Video ) కామెంట్ సెక్షన్ లో పోస్ట్ కూడా చేస్తున్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube