సింహాన్నే ఎదిరించిన జింక.. వెంట్రుకలు నిక్కబొడిచే వీడియో వైరల్..
TeluguStop.com
ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ రెండు లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలి.జంతువులను కూడా ఈ రెండు లక్షణాలే కాపాడతాయని అనడంలో సందేహం లేదు.
తాజాగా ఈ రెండు లక్షణాలు గల ఒక జింక అదే విషయాన్ని నిరూపిస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోను @TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది."ధైర్యాన్ని చూపిస్తే మీరు కూడా బలవంతులే అనే సంగతి తెలుస్తుంది.
" అని దీనికి ఒక క్యాప్షన్ జోడించింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక జింక నీటిలో ఉండటం మనం గమనించవచ్చు.
దాని ముందే ఒక పెద్ద సింహం కనిపించింది.ఆ నీటిలోనేమో ఒక పెద్ద మొసలి ఉంది.
అదే జింకపై ఒక్కసారిగా అటాచ్ చేసింది. """/"/
దాంతో ఉలిక్కిపడిన జింక( Deer ) వెంటనే దాని నుంచి ఎలాగోలా తప్పించుకుంది.
కానీ దాని ముందే ఉన్న సింహం దీన్ని చంపేసి తిందామని చూసింది.దాంతో జింక ప్రాణాలు పోయినట్లేనని వీడియో చూస్తున్న వారు అనుకున్నారు.
కానీ జింక ఊహించని ఓ పని చేసింది.అదేంటంటే సింహాన్ని( Lion ) ఎదిరించింది.
ఆ జింక ముందు అడుగులు వేస్తుంటే సింహం వెనకడుగులు వేసింది.ఈ సీన్ చూసేందుకు నమ్మశక్యంగా లేదు.
జింక తనను ఏదో ఆవహించినట్లు అది ప్రవర్తించింది.దేన్నైనా ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని అది చూపించింది.
"""/"/
దాని ధైర్యం చూసే సింహం భయపడింది.అది కొమ్ములతో కుమ్మేయడానికి దూసుకొస్తున్నప్పుడు సింహం పారిపోయింది.
మొత్తం మీద ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.ఇది చూసి నెటిజన్లు( Netizens ) స్టన్ అవుతున్నారు.
ఇంతకుముందు శాఖాహార జీవులు ఇలానే ధైర్యంగా ప్రవర్తించి సింహాలకు చుక్కలు చూపించాయని అంటున్నారు.
వాటికి సంబంధించిన వీడియోలు( Viral Video ) కామెంట్ సెక్షన్ లో పోస్ట్ కూడా చేస్తున్నారు.
దీనిని మీరు కూడా చూసేయండి.