వైరల్ వీడియో: దాహం కోసం కొలను దగ్గరికి వచ్చిన అడవిదున్నపై మొసలి ఏకంగా..?!

ప్రతిరోజు సోషల్ మీడియా పుణ్యమా అంటూ పెద్ద ఎత్తున్న వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాము.ఇక అసలు విషయంలోకి వెళితే.

అడవిలో కాస్త పెద్ద క్రూర జంతువులు కూడా అప్పుడప్పుడూ వాటి వేటలో విఫలం అవుతుండడం మనం అనేక వీడియోల ద్వారా చూస్తూనే ఉంటాము.అయితే ఇది ఇప్పుడెందుకు చెబుతున్నానంటే.! నీటిలో మొసలికి ఉన్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇది జగమెరిగిన సత్యమే.అందుకే కాబోలు మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు.

నీటిలో ఎంతటి పెద్ద జంతువులు అయినా సరే మొసలి ముందు తలవంచాల్సిందే.అది దాని పవర్‌.

Advertisement

అంతటి మొసలి తన వ్యూహంలో తాజాగా విఫలమైంది.మొసలి నోటి దాకా అందిన ఎరను చాలా దగ్గరలో మిస్ చేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.

అడవి దున్న నది ఒడ్డున దాహం తీర్చుకుంటు ఉండగా.అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.

మొసలి హఠాత్తుగా దానిపై మెరుపు దాడి చేసింది.అక్కడ ఉన్నది మొసలి కాబట్టి ఖచ్చితంగా ఆహారం కావాల్సిందేనని అనుకోని ఉండవచ్చు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

కాకపోతే అడవిదున్న తన తెలివిని బాగా ఉపయోగించింది.

Advertisement

తనపైకి వస్తున్న డేంజర్‌ ను కాస్త బాగా పసిగట్టి ముందుగానే పక్కకి ఎగిరింది.దాంతో మొసలి నోటికి చిక్కకుండా ప్రాణాలతో తప్పించుకుంది.కాకపోతే ఆ పక్కనే చెట్టు కొమ్మ అడ్డంగా ఉండటంతో మరోసారి మొసలి అడవిదున్నను పట్టుకునేందుకు తెగ ప్రయత్నించింది.

అయినా కానీ లాభం లేకపోయింది.మొసలికి చిక్కకుండా అడవిదున్న గెంతుకుంటూ అక్కడి నుండి తప్పించుకుని పారిపోయింది.

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు కామెంట్స్‌, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా వీక్షించండి.

తాజా వార్తలు