వైరల్: 70ఏళ్ల వృద్ధురాలు పైగా వికలాంగురాలు ఢిల్లీ నడిబొడ్డులో టిఫిన్ సెంటర్ ఎలా రన్ చేస్తోందో చూడండి!

మనం మన చుట్టూ ప్రతిరోజూ అనేక మందిని చూస్తూ ఉంటాం.నేది అన్ని అవయవాలు సరిగ్గా వున్న యువకులే బద్ధకావస్థలో వుంటున్నారు.

 Viral Video 70 Year Old Aunty Sells Thali For Rs 35 In Delhi Details, Viral Late-TeluguStop.com

జీవితం చాలా జటిలంగా ఉందని, ఎన్ని డిగ్రీలు చేసినా ఉపయోగం ఉండటం లేదని, ఉద్యోగావకాశాలు లేవనో… ఇలా రకరకాల షాకులతో వున్న కాస్త సమయాన్ని వృధా చేసేస్తున్నారు.ఇలాంటి పరిస్థితులలో ఒక వృద్ధ మహిళ, పైగా ఒక వికలాంగురాలు ఇక్కడ బతకడం అంటే యెంత కష్టమో అందరికీ తెలిసినదే.

అయితే ఆమె నాకేమి చేతకాదని రెస్ట్ తీసుకోలేదు.జీవితమంటే నిరంతరం ఓ సవాల్ అని అర్ధం చేసుకొని కాయకష్టం చేసుకొని యువతకి తీరుగా ముందుకు సాగిపోతోంది.

మన భారత దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 7 పదుల వయసున్న వృద్ధురాలిని గురించి వింటే మీరు అవాక్కవుతారు.మీకు తెలుసో లేదో గాని ఢిల్లీలో ఏ వస్తువు కూడా మనకు తక్కువ ధరకు దొరకవు.

ముఖ్యంగా కడుపు నింపే భోజనం, టిఫెన్ ఐటమ్స్ విషయానికి వస్తే చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.అయితే ఢిల్లీలోని సెంట్రల్ మార్కెట్ సమీపంలో కేఎఫ్‌సీకి ఎదురుగా చిన్న క్యాంటిన్ కనిపిస్తుంది.

అక్కడ ఓ 70సంవత్సరాల వృద్ధురాలు సింగిల్‌గా క్యాంటిన్ నిర్వహిస్తోంది.ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఈ వృద్ధురాలు కేవలం 35రూపాయలకే రుచికరమైన థాలిని అందించి ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తోంది.

అక్కడ మెనూకి, ఆమె తీసుకున్న డబ్బులకు ఎక్కడా పొంతన ఉండదు.కేవలం 35రూపాయలకు నాలుగు రోటీలతో పాటు రెండు పరోట, కొద్దిగా రైస్, రెండు రకాల కూరలు ఆమె ప్రేమగా వడ్డిస్తోంది.ఎంతో రుచికరంగా ఉండే ఈ థాలిని ఎలాంటి చెఫ్‌లు, కుక్‌లు లేకుండా కేవలం తానే ఓ బల్లపై కూర్చొని అప్పటికప్పుడు రోటీని తయారు చేసి కాల్చి వేడి వేడిగా వడ్డించడం కొసమెరుపు.70ఏళ్ల వయసు, పైగా తనకి ఓ చెయ్యి సరిగ్గా పని చెయ్యదు.ఆ ఒంటరి చేతితోనే ఇలా ఆమె అక్కడ సేవ చేయడం ఎంతో ఆదర్శనీయం కదూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube