వైరల్ వీడియో: అది శరీరమా.. లేక స్ప్రింగా..?!

క్రీడా రాజకీయాల్లో మహిళలు ఎంతగానో నలిగిపోతున్నారనే చేదు నిజాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.క్రీడా రంగంలో ఉండే రాజకీయాలు వల్ల.

ప్రతిభావంతులు ఎలా అవకాశాలు కోల్పోతారో ఇప్పటివరకు వచ్చిన చాలా బయోపిక్‌లలో కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఎంతో ప్రతిభ ఉన్నా కూడా చాలామంది క్రీడా పోటీల్లో పాల్గొనే అర్హత సాధించలేక.

మరోపక్క ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేక దయనీయమైన పరిస్థితులలో జీవితాన్ని సాగిస్తున్నారు.కేరళకు చెందిన 17 ఏళ్ళ జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణి వైష్ణవి కూడా ఇదే కోవలోకి వస్తుంది.

ఆమె ప్రతిభ చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే.ఈ బాలిక తన శరీరాన్ని స్ప్రింగ్ లా తిప్పడంలో తనకు తానే సాటి.

Advertisement
Viral Video 17 Years Kerala Gymnastics Vaishnavi With Extreme Talent, Vaishnavi

ఈమె జిమ్నాస్టిక్స్‌ క్రీడలో తన అద్భుతమైన ప్రదర్శనతో అతి పిన్న వయసులోనే 50కి పైగా స్వర్ణ పతకాలు సాధించింది.ప్రస్తుతం ఈ టాలెంటెడ్ జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో బాలిక చూపించిన ప్రదర్శన ఆద్యంతం అద్భుతంగా సాగింది.ఒక చిన్న చెక్క పెట్టపై నిల్చుని తన శరీరాన్ని ఒక స్ప్రింగ్ మాదిరి మెలికలు తిప్పి అబ్బురపరిచింది.

ఒక గుండ్రటి స్ప్రింగులా తయారై ఆమె చక్రంలా ముందుకు వెళ్ళిన తీరు అదిరి పోయిందనే చెప్పాలి.ఆమె సునాయాసంగా జిమ్నాస్టిక్స్‌ చేయడం చూస్తుంటే.

ఆమె టాలెంట్ ముందు ఒలింపిక్ క్రీడాకారులు కూడా దిగదుడుపేననే ఫీలింగ్ వస్తుంది.ఆమె తన కాళ్ళను చేతులను చాలా వేగంగా మెలికలు తిప్పుతుంటే కళ్లార్పకుండా చూడక మానరు.

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు

అది శరిరమా.లేక స్ప్రింగా అనే ప్రశ్న వీక్షకులలో రాక మానదు.

Viral Video 17 Years Kerala Gymnastics Vaishnavi With Extreme Talent, Vaishnavi
Advertisement

వైష్ణవి అసాధారణమైన ప్రతిభతో ఇప్పటికే అంతర్జాతీయంగా 8 మెడల్స్ సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా జరిగిన జిమ్నాస్టిక్స్‌ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచి సరిలేరు తనకెవ్వరూ అని నిరూపించింది.ప్రతిభ ఎవరి సొత్తు కాదని నిరూపించిన వైష్ణవి ప్రస్తుతం టీవీ షోలలో ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

ఇంత టాలెంట్ ఉన్న వారిని టీవీ షోలకు పరిమితం చేయడం నిజంగా విషాదకరం.క్రీడల్లో గెలిచిన ఒక్కరికే కోట్ల రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకోవడం కంటే ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో,ఒలింపిక్స్ లో అవకాశం కల్పిస్తే బాగుంటుంది.

వీరి వల్ల ఎన్నో పతకాలు భారతదేశాన్ని ముద్దాడుతాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు