వినడానికి విడ్డూరంగా మీరు ఇక్కడ చదివింది అక్షరాలా నిజం.గుండెను తీసి మరో గుండెను అదే స్థానంలో అమర్చే వెసులుబాటు ఉన్న ఈ టెక్నాలజీ కాలంలో గాల్లో విమానాల టైర్లను మార్చడం పెద్ద కష్టం కాదు అని మీలో కొంతమంది అనుకోవచ్చు.
అక్కడే వుంది అసలు ట్విస్ట్.వందేళ్ల క్రితం.
ఇలాంటి పని చేశారంటే మీరు నమ్ముతారా? మన ఊహలకే అందదు కదా.అవును, అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ మహిళ.విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ టైరును ఈజీగా మార్చేసింది.కాగా అలనాటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషమేనే చెప్పుకోవాలి.
యూఎస్ లాస్ ఏంజిల్స్( US Los Angeles ) పరిధిలో 1920లో ఈ ఘటన చోటు చేసుకోగా నెటిజన్లు ఆ వీడియోని కనులార్పకుండా చూస్తున్నారు.గ్లాడిస్ ఇంగిల్ అనే మహిళ.ప్రమాదంలో ఉన్న విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన తీరుని మనం కొనియాడకుండా వుండలేము.శిక్షణ విమానం గాల్లో ఉండగా.దానికి ఉన్న ఓ టైరు ప్రమాదవశాత్తు ఊడిపోయింది.దీంతో విమానం కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది.
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అధికారులు.ఇలాంటి విషయాల్లో శిక్షణ పొందిన గ్లాడిస్ ఇంగిల్‌ను( Gladys Ingle ) రంగంలోకి దించగా అప్రమత్తమైన ఆమె ఓ టైరును భుజానికి తగిలించుకుని విమానం రెక్కలపై నిల్చుని గాల్లోకి వెళ్లింది.
ఆ తరువాత విమానం రెక్కల పైకి వెళ్లి.చివరకు ప్రమాదానికి గురైన విమానం మీదకు ఎక్కింది.
ఆ తర్వాత ఆ విమానం కింద భాగానికి చేరుకుని టైరు వద్ద కూర్చొని తన వద్ద ఉన్న టైరును ఊడిపోయిన ప్రాంతంలో సెట్ చేసింది.దీంతో చివరకు ఆ విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది.వేల అడుగుల ఎత్తులో ఏమాత్రం భయం లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానంలోని వారి ప్రాణాలు కాపాడిన మహిళను అంతా అభినందనలతో ముంచెత్తారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.