వైరల్: ఎస్కలేటర్ నుండి పడిపోతున్న వృద్ధుడు.. దాంతో ఆ మహిళ..?!

ఆపదలో ఆదుకునేవాళ్లను సాయం అందుకున్నవారు మాత్రమే గుర్తించుకుంటారు.అయితే వారి సాయం విలువ వారికి మాత్రమే తెలుస్తుంది.

నేటి ప్రపంచంలో ఇటువంటి ఘటనలు చాలానే చోటుచేసుకుంటుంటాయి.ఇటువంటి తరుణంలో సోషల్ మీడియా అనేది ఇటువంటి ఘటనలను వెలుగులోకి తెస్తోంది.

సంఘటన ఎక్కడ జరిగినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా వెంటనే వైరల్​ గా మారుతోంది.దీని వల్ల చాలా మందికి మేలు జరుగుతోందనే చెప్పాలి.

చైనాలో ఓ మహిళ సూపర్​ మార్కెట్​ కు వెళ్ళింది.షాపింగ్​ పూర్తయిన అనంతరం కౌంటర్​ దగ్గర నిల్చొని బిల్​ పే చేస్తోంది.

Advertisement

కాస్త దూరంలో ఉన్న ఎస్క​లేటర్​ పై నుంచి ఒక వృద్ధుడు వీల్​ చైర్​ లో కూర్చొని కిందకి వస్తున్నాడు.ఆ వీల్​ చైర్ ను కంట్రోల్​ చేయాల్సిన కుర్రాడు బ్యాలెన్స్​ తప్పి ఎస్కలేటర్​ పై పడిపోయాడు.

దీంతో వీల్​ చైర్ లో ఉన్న వృద్ధుడు ప్రమాదంలో పడ్డాడు.ఇది గమనించిన మహిళ అత్యంత వేగంగా పరుగెత్తి ఆ వృద్ధుడ్ని వీల్​ చైర్​ నుంచి కిందకి పడిపోకుండా కాపాడింది.

కింద పడిపోయిన ఆ కుర్రాడిని కూడా రక్షించింది.వీల్​ చైర్ తో పాటు కింద పడిపోయిన కుర్రాడికి మాత్రం చిన్న గాయాలయ్యాయి.

ఈ ఘటనను ప్రముఖ మీడియా వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా  ఇంటర్నెట్‌ లో వైరల్​ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళను ప్రసంశలతో ముంచెత్తారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ ఘటన చైనాలో ఉన్న ఓ సూపర్​ మార్కెట్​ లోని సీసీటీవీలో రికార్డయ్యింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​ గా మారడంతో వీడియోను చూసిన నెటిజన్లు అందరూ మహిళను అభినందిస్తున్నారు.

Advertisement

వృద్ధుడి ప్రాణాలను కాపాడిన ఆమెకు హ్యాట్సాఫ్​ చెబుతున్నారు.ఆమె ఇద్దరిని కాపాడినందుకు సోషల్ మీడియా ద్వారా చాలా మంది హర్షం వ్యక్తం చేశారు.

మహిళ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.

తాజా వార్తలు