సోషల్ మీడియాలో అనునిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి.
కాగా తాజాగా వైరల్ అవుతున్న వీడియో కాస్త ఆశ్చర్యంగానూ, ఫన్నీగాను అనిపిస్తుండడం విశేషం.ఇక మనదేశంలో వివిధ సిటీలలో ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరీ ముఖ్యంగా ఐటీ సంస్ధల( IT organizations ) అడ్డాగా మారిన బెంగళూర్ ట్రాఫిక్ జామ్‌ల గురించి అందరికీ తెలిసినదే.
అందుకే, ఇక్కడ చాలామంది ఆ సిటీని ట్రాఫిక్ జామ్స్( Traffic jams ) సిటీగా పేర్కొంటారు.అవును, బెంగళూర్‌లో కార్యాలయాలకు సకాలంలో చేరాలంటే దాదాపు రెండు, మూడు గంటలు ముందుగా స్టార్ట్ కావాల్సిన పరిస్ధితి వుంది.ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలను ఏకరువు పెడుతూ పలువురు ప్రయాణీకులు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుండగా తాజాగా సాయిచంద్ బయ్యవరపు బెంగళూర్( Bangalore ) ట్రాఫిక్ కష్టాలపై ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయిన బస్ డ్రైవర్ తన సీటులో కూర్చుని లంచ్ చేస్తుండటం స్పష్టంగా చూడవచ్చు.ఏంటి, ఆశ్చర్యంగా వుందా? నిజమేనండి బాబు.బెంగళూర్‌లో ట్రాఫిక్ కష్టాలు అంత దారుణంగా ఉంటాయి మరి.ఓ రెండుగంటల పాటు అలా బస్సులో ఏ పనైనా చేసుకోవచ్చు.సదరు వీడియో సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంటున్నట్టు రికార్డు బట్టి అర్ధం అవుతోంది.ఈ పోస్ట్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 24 లక్షల మంది దానిని చూడడం కొసమెరుపు.
అంతేకాకుండా చాలామంది అది నిజమే… ట్రాఫిక్ అనేది నేడు ఇండియాకి పెద్ద సమస్యగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు.