దేశీయ కార్ల మార్కెట్లో ఎస్‌యువిలకు వున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.ఇక్కడి జనాలు ఎక్కువ మంది దేశీయ కంపెనీలకు చెందిన వాహనాలను ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతూ వుంటారు.
అందులో మహీంద్రా( Mahindra ) ఒకటి.ఈ క్రమంలోనే తాజాగా మహీంద్రాకి చెందిన ‘స్కార్పియో ఎన్’( Scorpio N ) మెట్లెక్కే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
యూట్యూబ్లో విడుదలైన వీడియోలో లేటెస్ట్ మహీంద్రా స్కార్పియో ఎన్ చాలా అలవోకగా మెట్లు ఎక్కడం చూడవచ్చు.

ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వైట్ కలర్ స్కార్పియో మెట్లు ఎక్కడమే కాదు, చాలా తేలికగా మెట్లు దిగటం ఇక్కడ గమనించవచ్చు.ఈ వీడియో చూస్తే మీకు మహీంద్రా స్కార్పియో ఎన్ కెపాసిటీని మీరు మెచ్చుకోకుండా ఉండలేరు.ఇకపోతే, మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఆధునిక కార్లలో స్కార్పియో ఎన్ ఒకటి.
ఇది మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువగా బుకింగ్స్ సాధించి రికార్డ్స్ సాధించింది.చూడగానే ఆకర్షించే డిజైన్ ఈ కారు సొంతం.భారతదేశంలో మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధరలు ఇప్పుడు రూ.13.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.24.51 లక్షల వరకు ఉంటాయి.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫీచర్లు:
1.2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ & 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ రకాలు.
2.పెట్రోల్ ఇంజిన్ 198 bhp పవర్ 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.అదే డీజిల్ ఇంజిన్ 173 bhp పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
3.రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తాయి.
4.మల్టిపుల్ వేరియంట్లలో & మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో కలదు.







