సోషల్ మీడియా( Social media )కు బాగా ప్రజాదరణ పెరగడంతో దేశవ్యాప్తంగా ఎలాంటి ఆసక్తికరమైన సంఘటనలు జరిగినా అవి వీడియోల రూపంలో దర్శమిస్తున్నాయి.నేటితరం పిల్లలు చిన్నవారు అయినా పెద్ద వాళ్లకు పోటీ ఇస్తున్నట్టు పనులు చేస్తూ వుంటారు.
అది అమాయకత్వమో లేక వారి మూర్ఖత్వమో ఒక్కోసారి అర్ధం కాదు.ఒక్కోసారి వారు చేసే పనులు చూసినప్పుడు కోపం వస్తుంది.
తాజాగా అలాంటి ఓ సంఘటన తాలూక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిండా పదేళ్లు కూడా లేని ఓ పిల్లాడు తన అమ్మమ్మను వెంటబెట్టుకుని బండిమీద వెళ్లే తీరుని చూస్తే మీకు కూడా కోపం వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఈరోజుల్లో పిల్లలకు మంచి చెప్పినా బూతులాగా వినబడుతుంది.ఇక్కడ కూడా అదే జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో నిండా 10ఏళ్ళు కూడా లేని పిల్లాడు మోపెడ్ బైక్ ( Moped Bikes )మీద వెళ్తున్నాడు.
వెనుక సీటులో ఆ పిల్లాడి బామ్మ కూర్చుని ఉంది.ఆమె వృద్దురాలు కావడం గమనార్హం.

అంత చిన్న పిల్లాడు బైక్ నడపడమే నేరమైతే, వాడు దానిమీద ఆ ముసలామెని ఎక్కించుకొని రోడ్డుపైన ఓ రాకెట్ లాగా దూసుకుపోవడం కొసమెరుపు.ఇక ఆ పిల్లాడు అంత వేగంతో వెనక బామ్మను కూర్చోబెట్టుకుని వెళుతుండటం పక్కనే కారులో వెళుతున్న వ్యక్తి గమనించి, కాస్త నిదానంగా డ్రైవ్ చెయ్యి అని ఆ పిల్లాడికి సలహా ఇచ్చాడు.మరి ఆ మాట వినగానే ఆ పిల్లాడికి ఇగో హార్ట్ అయినట్టుంది.అప్పటికే వేగంగా వెళుతున్న బైక్( Bike ) ను మరింత వేగం పెంచి కారును దాటుకుని వెళ్లిపోవడం గమనార్హం.
కాగా పిల్లాడు బైక్ అంత వేగంగా నడుపుతున్నా బామ్మ మాత్రం ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉండడం కొసమెరుపు.కాగా వాడి ప్రవర్తనకు నెటిజన్లు వాడిని కన్న బాబుని తిడుతున్నారు.
