వైరల్: ఈడు పిల్లాడు కాదు పిడుగు... చేపల్ని ఎలా పడుతున్నాడో ఒకసారి చూడండి!

ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరూ తక్కువకాదు.అందుకే ఎవరినీ అంత త్వరగా తక్కువ చేసి మాట్లాడకూడదు.

ఎందుకంటే ఎవరి టాలెంట్ వారిది.ఈ క్రమంలో వీళ్లు తక్కువ, వీళ్లు ఎక్కువ అని చెప్పడానికి వీలు లేదు.

ఇక్కడ ఒకరికున్న ప్రతిభ ఇంకొంకరి లేకపోవచ్చు.ఒక్కో విషయంలో ఒక్కొక్కరు నిష్ణాతులు అయివుంటారు.

ఈ తంతంతా ఎందుకు అంటే, ఇంటర్నెట్ లో ఒక వీడియో తెగ హల్ చల్ చేస్తుంది.కాగా సదరు వీడియో చూసినవారు ఈ పిల్లాడేంటి.

Advertisement

వీడికింత టాలెంట్ ఎక్కడినుండి వచ్చింది? అంటూ జనాలు తెగ మెచ్చుకుంటున్నారు.

సదరు వీడియోలో ఒక బాలుడు చేపలు పడతాడు.అందులో వింత ఏముంది అని అనుకోవద్దు.ఎందుకంటే ఈ పిల్లాడు చేపలు పట్టే టెక్నిక్ అంత ఆషామాషీ టెక్నిక్ కాదు.

ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను ది బెస్ట్ ( The Best )అనే పేజ్ వేదికగా ట్విట్టర్లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.ఈ క్లిప్ లో ఓ చిన్న బాలుడు ఎక్కువ లోతు లేని చిన్న నీటి గుంట దగ్గరకు వెళ్లడం గమనించవచ్చు.

నీటి గుండ ఒడ్డున మాంజా( Manja ) ఉన్న రెండు చెక్క దుంగలను భూమిలో పాతుతాడు.ఆ తర్వాత పిండి ముద్దలు చేసి గాలానికి కట్టి దాన్నీ నీళ్లలో విసిరేస్తాడు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

అలా చేసాక ఓపిగ్గా కొంతసేపు ఆ ఒడ్డున కూర్చుంటాడు.కాసేపటికే మాంజా కదలడం మొదలవుతుంది.దీంతో ఆ బాలుడు ఆ గాలాన్ని ఒడ్డుకు లాగడం మొదలు పెడతాడు.

Advertisement

ఇంకేముంది కట్ చేస్తే ఈ గాలానికి రెండు పెద్ద పెద్ద చేపలు వేలాడుతాయి.దాంతో వెంటనే ఆ చేపలను లటుక్కున తన వెంట తెచ్చుకున్న సంచిలో వేస్తాడు.ఇది చూసేవాళ్లకు చిన్న విషయమే అయినా.

అంత చిన్నపిల్లాడు అలాంటి పని చేయడాన్ని ఇపుడు నెటిజలు తెగ మెచ్చుకుంటున్నారు.కాగా ఈ వీడియోకి సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం అని క్యాప్షన్ జోడించడం కొసమెరుపు.

కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగానే మిలియన్ పైగా వ్యూస్ రావడం రికార్డ్.

తాజా వార్తలు