పది చదివినోడు, పీజీ చేసినోడు ఒకే ఉద్యోగం వైరల్‌ అవుతున్న జొమాటో డెలవరీ బాయ్‌ ఫ్రొఫైల్‌

మన దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిన్న క్లర్క్‌ ఉద్యోగం కోసం లక్షల మంది దరకాస్తులు చేయడం మనం ఈమద్య కాలంలో చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు.కొందరు ప్రభుత్వ ఉద్యోగం కోసం అంటూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే మరి కొందరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు లేని వారు ప్రైవేట్‌గా ఏదో ఒక ఉద్యోగం అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

చదువుతో సంబంధం లేకుండా అత్యంత దారుణమైన ఉద్యోగాలు చేస్తున్న వారు ఇండియాలో లెక్కకు మించి ఉంటున్నారు.

పది ఫెయిల్‌ అయిన వారు మరియు పీజీ పూర్తి చేసిన వారు కొన్ని సందర్బాల్లో ఒకే ఉద్యోగం చేయడం మన దేశ పరిస్థితికి అద్దం పడుతుంది.తాజాగా కోల్‌కత్తాలో ఈ సంఘటన మరోసారి నిరూపితం అయ్యింది.ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థలు ఈమద్య కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి.

Advertisement

వాటిలో డెలవరీ బాయ్‌గా భారీ సంఖ్యలో నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు.వారు డెలవరీ సంస్థలు ఇచ్చే చాలీ చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు.

అయితే డెలవరీ బాయ్స్‌గా కనీస విద్యార్థత పది అంటూ జొమాటో నిర్ణయించగా పీజీ పూర్తి చేసిన వారు కూడా ఆ ఉద్యోగం కోసం పని చేస్తున్నారు.

కోల్‌కత్తాకు చెందిన మిరాజ్‌ అనే కుర్రాడు జొమాటోలో ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా చేరాడు.ఈమద్య జొమాటో ఫుడ్‌ డెలవరీ బాయ్స్‌కు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతుంది.అలాగే మిరాజ్‌ దత్తా వివరాలను కూడా ఉంచింది.

శౌవిక్‌ దత్తా అనే కస్టమర్‌ తాజాగా ఫుడ్‌ను ఆర్డర్‌ చేశాడు.తనకు ఫుడ్‌ ను తీసుకు వచ్చే వక్తి గురించి చూడాలనుకున్న శౌవిక్‌ దత్తా యాప్‌లో మిరాజ్‌ వివరాలు చూసి అవాక్కయ్యాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మిరాజ్‌ ఎంకాం చేయడంతో పాటు, ఫైనాన్స్‌లో డిప్లమా చేశాడు.ఇంత చదువు ఉన్నా కూడా ఏ ఉద్యోగం రాకపోవడంతో ఇలా డెలవరీ బాయ్‌గా చేస్తున్నాను అంటూ మిరాజ్‌ చెప్పాడు.దాంతో శౌవిక్‌ ఆశ్చర్యపోయాడు.

Advertisement

మిరాజ్‌ గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.ఆ విషయం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యింది.

అది కాస్త కొన్ని సంస్థల దృష్టికి రావడంతో మిరాజ్‌కు జాబ్‌ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.సోషల్‌ మీడియాతో మిరాజ్‌ కూడా హెల్ప్‌ పొందాడు.

తాజా వార్తలు