వైరల్: పెంపుడు పిల్లిని అమాంతం మింగిన కొండచిలువ..!

థాయిలాండ్ దేశానికి చెందిన కంచి నార్డ్ అనే కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ఓ బుజ్జి పిల్లిని పెంచుకుంటుంది.

దానికి ‘హో జూన్’ అనే పేరును కూడా పెట్టారు.

ఏప్రిల్ 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి పెంపుడు కుక్క పిల్ల కనిపించలేదు.పెంపుడు పిల్లి కోసం కుటుంబమంతా ఇంట్లో ప్రతి మూలను వెతుకులాట కొనసాగించారు.

అయితే ఇలా వెతకడంలో లార్డ్ కుమార్తెకు పెరటిలో ఓ భారీ కొండచిలువ కనిపించింది.దాంతో ఆ చిన్నారి భయబ్రాంతులకు లోనయ్యింది.

చిన్నారి ఆ కొండచిలువను చూసినప్పుడు కొండచిలువ పొట్ట ఉబ్బిన్నట్లు ఉండడంతో తన పెంపుడు పిల్లిని మింగేసి ఉంటుందని గ్రహించి ఆ చిన్నారి కన్నీరుమున్నీరైంది.దీంతో ఇంటి పెరట్లో ఉన్న కొండచిలువ సమాచారాన్ని ఆ ప్రాంత అటవీశాఖ సిబ్బందికి చేరేవెయ్యగా అటవీశాఖ అధికారులు సదరు ఇంటికి వచ్చి ఆ కొండచిలువను బంధించి తీసుకెళ్లారు.

Advertisement

అయితే ఆ కొండచిలువ మింగిన వారి పెంపుడు పిల్లి మళ్లీ తిరిగి రాదని ఆ కుటుంబం తెగ తల్లడిల్లిపోయింది.ఈ తతంగానికి సంబంధించిన ఫోటోలను తాజాగా నార్డ్ భార్య ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

ఇందులో వారి కుమార్తె ఆవేదనను తెలిపే విధంగా పెట్టిన ఫోటో అందరికీ బాధ కలిగించేలా ఉండడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

దీంతో ప్రస్తుతం నెటిజన్లు ఆ పాపకు వారి సానుభూతిని తెలుపుతున్నారు.పెంపుడు పిల్లి ని కోల్పోయిన వారి కుటుంబానికి నెటిజన్స్ పెద్ద ఎత్తున సంతాప సందేశాలు తెలుపుతున్నారు.ఇందులో ఒకరు మరో పెంపుడు పిల్లిని ఉచితంగా వారికి ఇచ్చేందుకు ముందుకు రావడం నిజంగా విడ్డూరమే.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు