వైరల్: మంచు అధికమై గడ్డ కట్టుకుపోయిన జింక... ఎలా అయిపోయిందో చూడండి పాపం!

ప్రస్తుతం మనదగ్గర కొన్ని ప్రాంతాలలో చలి తీవ్రత చాలా దారుణంగా ఉంటోంది.మైనస్ డిగ్రీలకు పడిపోతోంది.

 Viral: Deer Frozen Due To Heavy Snow See How It Ended , Dear, Viral Latest, News-TeluguStop.com

దాంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివాళ్ళు తీవ్రంగా బాధపడుతున్నారు.ఇక మనదగ్గరే ఇలా ఉంటే ఫారిన్ కంట్రీలైన అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాలలోని తీవ్రత ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి మరి.ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చల్లని గాలులు వీయడం, చల్లని తుపాను ప్రభావం, చలి తీవ్రతతో అక్కడి జనజీవనం అతలాకుతలం అయిపోతున్న ఘటనలు మనం చూస్తూ వున్నాం.

ఇక ఉండటానికి ఇళ్లు ఉన్న మనుషుల పరిస్థితే అలా ఉంటే ఇక షెల్టర్ లేని జంతువుల స్థితిగతులు ఎలా వుంటాయో ఆలోచించండి.

అవి ఆ చల్లని మంచులో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు తప్పక చూడాల్సిందే.అవును, ఇక్కడ వీడియోలోని ఓ జింక ఎలాంటి పరిస్థితిని అనుభవిస్తుందో చూస్తే కళ్ళు చెమర్చక మానవు.

దాని కళ్లు, చెవులతో పాటు పూర్తిగా ముఖమే గడ్డ కట్టుకుపోవడంతో దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

అయితే, దాని ఇబ్బందిని గమనించిన కొందరు బాటసారులు దానికి సహాయం చేసి, దాని ముఖంపై ఉన్న మంచు గడ్డలను చాలా జాగ్రత్తగా తొలగించడం ఇక్కడ చూడవచ్చు.కాగా దీనికి సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.నెటిజన్లు జింకకు సహాయం చేసిన బాటసారులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఒక యూజర్ కామెంట్ చేస్తూ ‘మీరు చేసిన ఈ పని చాలా ఆదర్శవంతమైనది! ఇలా అందరూ ఆలోచిస్తే దేశం స్థితిగతులు ఇంకోలా ఉండేవి!’ అని కామెంట్ చేయగా, ‘జింక నిద్రిస్తున్నప్పుడు మంచు తుఫాను కారణంగా ఈ పరిస్థితికి వచ్చి ఉండవచ్చ’ని మరో నెటిజన్ అంచనా వేశాడు.