విక్రాంత్ రోణా ఫస్ట్ రివ్యూ ఇదే.. కిచ్చా సుదీప్ ఖాతాలో సక్సెస్ చేరినట్టేనా?

కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కిన విక్రాంత్ రోణా ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం సుదీప్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Vikranth Rona Movie First Review Details Here Goes Viral,vikrant Rona,kichcha Su-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలు కాగా ఈ సినిమాతో సుదీప్ ఖాతాలో హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

రామారావు ఆన్ డ్యూటీకి పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను ఉమైర్ సంధు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.విక్రాంత్ రోణా పైసావసూల్ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు.అనూప్ బండారి డైరెక్షన్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు.విక్రాంత్ రోణా మూవీలో యాక్షన్ టాప్ క్లాస్ లో ఉందని ఆయన తెలిపారు.

Telugu Review, Kannada, Kgf, Kichcha Sudeep, Sudeep, Umair Sandhu, Vikrant Rona-

సినిమాలో సుదీప్ లుక్ డాషింగ్ గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఆయన కామెంట్లు చేశారు.కన్నడలో కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా అద్భుతమని ప్రస్తుతం ఈ సినిమా కూడా అద్భుతమని ఆయన చెప్పుకొచ్చారు.ఉమైర్ సంధు రివ్యూలు కొన్నిసార్లు నిజమైతే మరి కొన్నిసార్లు నిజం కాలేదు.

మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడేవారని ఇండస్ట్రీలో ఒక విమర్శ ఉండేది.

అయితే ఇప్పుడు కన్నడ దర్శకనిర్మాతలు సైతం ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదు.కిచ్చా సుదీప్ భారీ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంటారో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube